For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోంగూర పన్నీర్ కర్రీ

|

Gogura - Paneer Curry
ఇంటికి పచ్చతోరణం అంటే ఆ ఇల్లు కళకళలాడుతున్నట్టు. ఒంటికి పచ్చని ఆకు ఆహారంగా అందుతుంటే ఆ ఒళ్లు ఆరోగ్యంతో కళకళలాడుతున్నట్టు మూర్ఛల్లిన లక్ష్మణుడికి సంజీవినిగా చేసింది మంత్రమో, తంత్రమో కాదు.. పచ్చని ఆకే! ఆయుర్వేదం ఆకుకు మొక్కింది. మనం ఆ ఆకునే పరమాన్నం అనుకుందాం. ఆకుకూరతో ఆరోగ్యం పొందుదాం. టేస్ట్ ఎంజాయ్ చేద్దాం..

కావలసిన పదార్థాలు:
పన్నీర్: 100grams
గోంగూర: 6కట్టలు
ఉల్లిపాయ ముక్కలు: 1cup
పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు: ఒక్కోటి ఆరు చొప్పున
దాల్చిన చెక్క: చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడ
నెయ్యి: 2tsp
కారం: 1tsp
జీడిపప్పు: 10
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిమిషా తర్వాత తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొన్ని నీళ్లు పోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర జీడిపప్పు వేసి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించి చల్లార్చాలి.
4. తర్వాత వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ , పన్నిర్ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి తక్కువ సెగమీద మగ్గనిచ్చి దించేయాలి. గోంగూర పనీర్ ను రోటీలతో తింటే రుచిగా ఉంటుంది.

సూచన: పన్నీర్ ను ఇంటి దగ్గరే తయారు చేసుకోవాలనుకుంటే .. ప్యాకెట్ పాలను కాకుండా ఆవు, గేదె పాలను ఉపయోగిస్తే మంచిది.
2. పన్నీర్ తయారు చేసుకునేటప్పుడు పాలను పెద్ద మంట మీద కాచాలి. బాగా కాగిన తరువాత అందులో కొద్దిగా వెనిగర్ కాని, ఐదు ఆరు చుక్కల నిమ్మరసం కాని వేసి స్టౌకట్టేయాలి.
3. పాలను ఎక్కువగా విరగనివ్వకూడదు. సుమారు 75శాతం విరగగానే పైపైన ఉండే నీటిని వడకట్టాలి.
4. తర్వాత ముద్దలా ఉన్న పదార్థాన్ని మూట కట్టి దాని మీద బరువు ఉంచాలి. అప్పుడు పన్నీర్ అచ్చులాగ, బ్లాక్స్ గా వస్తుంది.
5. పన్నీర్ కూరలో వాడుతున్నప్పుడు విరిగిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే... కొద్దిపాటి వేడినూనెలో దోరగా వేయించి తీసి వెంటనే చన్నీళ్లలో వేయాలి. అప్పుడు అవి కొద్దిగా గట్టిగా తయారవుతాయి. వాటిని వంటలో వాడుకోవాలి.

English summary

Gogura - Paneer Curry | గోంగూర పన్నీర్ కర్రీ

Gongura is popular in the state of Andhra Pradesh. Gongura is a tasty and popular leaf which is used in most of Andhra cuisines. it's sourness is enjoyed to its best and this is one of their popular .
Story first published:Friday, June 15, 2012, 17:01 [IST]
Desktop Bottom Promotion