For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘గోంగూర మెంతి’ పచ్చడి

|

Gongura Menthi Pacchadi
కావలసిన పదార్థములు:
గోంగూర - 2 కట్టలు
మినపప్పు - 2 tbsp
శనగపప్పు - 2 tbsp
మెంతులు -కొద్దిగా
జిలకర్ర - 1tsp
ఆవాలు - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1tsp
నూనె - 50 grm
వెల్లుల్లి - 6 రెబ్బలు
ఉల్లిపాయ - 2
ఎండుమిర్చి - 6
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు

తయారు చేయు విధానము:

గోంగూర ఆకులను విడిపించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బానలిలో మినపప్పు, శనగ పప్పు, ఎండు మిరప, మెంతులు, జిలకర్ర, వెల్లుల్లి పాలయలు వేసి సన్నని మంట మీద దోరగా వేపి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బానలిలో కొద్దిగా నూనె వేసి విడిపించి పెట్టుకొన్న గోంగూర ఆకులను వేసి సన్నని మంటమీద వేపాలి. ముందుగా వేపుకొన్న పప్పుదినుసులు, తర్వాత వేపిన గోంగూరకు తగినంత ఉప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని. బానలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వేసి వేగిన తర్వాత గ్రైడ్ చేసి పెట్టుకొన్న పచ్చడిని పోపులో వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చిటికెడు ఇంగువ కలుపుకొని స్టౌవ్ మీద నుండి దింపుకొని వేడి వేడి రైస్ తో ఆరగించండి. గోంగూరలో జీర్ణ శక్తిని పెంచే గుణాలున్నాయి. కాబట్టి జీర్ణక్రియకు బాగా తోడ్పడి ఆకలిని పెంచుతుంది.

Story first published:Wednesday, October 7, 2009, 18:31 [IST]
Desktop Bottom Promotion