For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు-టమోటో కూర

|

Green Gram Tomato Curry
సాంప్రదాయ రుచులల్లో పెసరపప్పుతో చేసే రుచులుకూడా ఒక్కటి. పెసరపప్పుతో స్వీట్ మరియు హాట్ రెండూ చేస్తారు. పెసరపప్పు ఎలా తయారు చేసుకొన్నా చాలా సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచి పౌష్టికాహారం. పెసరపప్పుతో చేసే హల్వా భలే రుచిగా ఉంటుంది. పెసరపప్పుతో చేసే ఏ వంటకమైనా సరే చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ముఖ్యంగా పెసరపప్పుకి, సాధారణమైన ఆకుకూరలు జోడించి వండితే అమోఘమనిపించే రుచిని అందించగలిగే సత్తా కేవలం పల్లెవాసులకే సొంతం. ఆ అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదించండి..కొత్త ఉత్సాహాన్ని పొందండి.

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
టమాటోలు: 4-6
జీలకర్రపొడి: 1/2tsp
మెంతి పొడి: 1/2tsp
పచ్చిమిర్చి: 3
ఉల్లిపాయ: 1tsp
నూనె: 5tsp
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తురుము: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును శుభ్రం చేసుకోవాలి.
2. తర్వాత టొమాటో, పచ్చిమిర్చి మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తగరిగి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందాులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
5. ఇప్పుడు అందులో కడిగి పెట్టుకొన్న పెసరపప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి టొమాటో కూడా వేసి ఉడకనివ్వాలి. 6. టమోటో సరిపోనట్లైతే కొద్దిగా పాలు కానీ, నీళ్ళు కానీ కలుపుకోవచ్చు. పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉడికించి, కొత్తిమీర తురుమును గార్నిష్ చేసి దింపుకోవాలి. అంతే టమోటో పెసరపప్పు రెడీ. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ, పూరీ, జీరా పలావ్ వంటి వాటిల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని కూడా తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది.

English summary

Green Gram Tomato Curry | పెసరపప్పు-టమోటో కూర

This one is a traditional recipe. Green gram dal is healthy and easy to digest. simple and light tangy curry with whole moong dal. This is so tasty recipe which suits well with both Chapathi/rotis and white rice and jeera Pulav.
Story first published:Tuesday, June 5, 2012, 14:51 [IST]
Desktop Bottom Promotion