For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీరా టమోటా పలావ్

|

Jeera Tomato Pulao
మోటో పలావ్ బాగా ప్రాచుర్యం చెందినటువంటి వంటకం. కొంచెం వెరైటీగా జీరా చేర్చి వండితో మరింత రుచిగా ఉంటుంది. అంతే కాదు ఈ జీరా టమోటో పలావ్ లో సోయా గింజలు, పచ్చిబఠానీలు, వెల్లుపాయలు వంటివి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. టమోటా వినియోగించడంలో అందులో సి విటమిన్ ఎక్కువ శరీరానిక చేరుతుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటిన్స్ కూడా అందుతాయి.

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
సోయా గింజలు: 1cup
జీలకర్ర: 1tsp
గరం మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
పలావ్ ఆకు: 1
నీళ్ళు 4cup
టమాటా గుజ్జు: 2cup
ఎండుమిర్చి: 4(కచ్చాపచ్చాగా పొడిచేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6
జాజికాయ పొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
గార్నిష్ కోసం
ఉడికించిన బఠానీలు: 1/2cup
అల్లం తురుము: 1tbsp
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. సోయా గింజలను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి.
2. తర్వాత మందపాటి గిన్నెను తీసుకుని అందులో నూనె పోసి వేడయ్యాకా అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యాని ఆకు వేసి వేయించాలి.
3. అందులోనే ఉల్లిపాయ, అల్లం ముక్కలు, జాజికాయపొడి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మరో రెండు నిమిషాలు పాటు వేయించితియ్యాలి.
4. తర్వాత అందులో నానబెట్టిన సోయా గింజలు వేసి పొడి అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్ళు పోసి పొంగు రానివ్వాలి. అందులో బియ్యం వేసి ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
5. ఇప్పుడు మంట తగ్గించి బియ్యం సగంపైన ఉడికేదాకా ఉంచి అందులో టామటా గుజ్జు పోసి ఒక సారి కలిపి తర్వాత మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి.
6. తర్వాత స్టౌమీద నుంచి దించి ఒక ఐదు నిమిషాల పాటు మూత తియ్యకుండా ఉంచాలి. సర్వ్ చేసే సమయంలో దానిపై ఉడకబెట్టిన బఠాణీ, అల్లం తురుము వేసి, రైతాతో వడ్డించాలి. అంతే టమోటో పలావ్ రెడీ..

English summary

Jeera Tomato Pulao | జీరా టమోటా పలావ్

Tomato Pulao is one of the most nutritious pulao recipe, This have soya beans, green peas and onions giving it additional health benefits.
Story first published:Monday, April 9, 2012, 12:20 [IST]
Desktop Bottom Promotion