For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ -చపాతీ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ వంకాయ కర్రీ:

|

వంకాయను తమిళంలో కత్రికాయ్ అంటారు . వెజిటేరియన్ వంటకాల్లో వంకాయ ఒక ఫేవరెంట్ వెజిటేరియన్ డిష్. మనందరికి గుత్తివంకాయ, బైగన్ బర్తా చాలా బాగా తెలుసు. రోస్ట్ చేసిన వంకాయ నార్త్ సైడ్ చాలా ఫేమస్. దక్షిణ భారతదేశంలో వంకాయతో వివిధ రకాలు స్పెషల్ డిష్ లను వండుతారు. అందులో కత్రికాయ్ కర్రీ తమిళనాడులో చాలా ఫేమస్.

స్పైసీ వంకాయ కర్రీని ఎక్కువ ఉల్లిపాయలు మరియు సుగంధపరిమళాలు మసాలా దినుసులతో తయారు చేస్తారు. ఈ కర్రీకు ఎక్కువ వస్తువలేమి అవసరం ఉండదు. స్పెషల్ వెజిటేరియన్ వంటకానికి శెనగపప్పు పౌడర్ స్పెషల్ టేస్ట్ ను అంధిస్తుంది. మరియు ఈ డిష్ తయారు చేయడం కూడా చాలా సులభం మరి తమిళనాడు స్పెషల్ కత్రికాయ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
వంకాయ: 500grms
ఉల్లిపాయలు: 2(స్లైస్ గా కట్ చేసుకోవాలి)
శనగపప్పు: 1tbsp
ధనియాలు: 1tbsp
ఎండుమిర్చి: 3
పసుపు: 1tsp
ఆవాలు: 1ొతూ
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా వంకాయలను బాగా శుభ్రం చేసి, కాడను కట్ చేసి వాటిని మీకు కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో ఒక చెంచా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులోనే శెనగపప్పు, ధనియాలు, మరియు ఎండు మిర్చి, వేసి మరో రెండు నిమిషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఒకసారి ఇది చల్లబడిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పౌడర్ లా తయారు చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ ఆయిల్ ను పాన్ లో వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, వేసి మరో నిముషం పాటు వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, ఉల్లిపాయ మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
6. తర్వాత అందులో వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి.
7. అలాగే పసుపు, శెనగపప్పు మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఈ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతండాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి.
9. ఇక సారి అంతా ఉడికిన తర్వాత వంకాయ పూర్తిగా ఉడికిందో లేదో సరిచూసుకొని, స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. తమిళ స్టైల్ వంకాయ కర్రీ రెడీ. చపాతీ లేదా రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Kathrikkai Curry: Spicy Eggplant Recipe | తమిళనాడు స్పెషల్ కత్రికాయ్(వంకాయ)కర్రీ...

Kathrikkai in Tamil means brinjal or eggplant. Eggplant or brinjal is one of the favourite vegetables of many vegetarians. We all know about the famous baingan bharta or the roasted eggplant curry from North-India. However eggplant is cooked with even more delectable flavours in the South. The kathrikkai curry from Tamil Nadu is one such example.
Desktop Bottom Promotion