For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కట్టా మీటా చెన్న చాట్ : రంజాన్ స్పెషల్

|

రంజాన్ సందర్భంగా మీరు ఉపవాసం ఉంటున్నారా? అయితే మీకోసమే కొన్ని హెల్తీ మరియు రుచికరమైన రిసిపిలను మీకు అందిస్తున్నాం. ఇఫ్తార్ ఉపవాసంను బ్రేక్ చేసే సమయంలో ఇటువంటి హెల్తీ, న్యూట్రీషియన్ ఫుడ్స్ ను తీసుకోవడం చాలా అవసరం.

కటామీటా చెన్నా ఛాట్ రిసిపి స్వీట్ గా మరియు కొద్దిగా పుల్లగా ఉంటుంది. స్వీట్ టామరిండ్ చట్నీకి కొద్దిగా బెల్లం చేర్చడం వల్ల ఈ మంచి టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా ఈ స్పెషల్ చెన్నా చాట్ రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...

కావల్సిన పదార్థాలు:

కాబూలి చెన(chickepeas): 1cup
టమోటో: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరగాలి)
బంగాళ దుంపలు: 2(ఉడికించి కట్ చేయాలి)
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగివి)
స్వీట్ చింత పచ్చడి: 2tbsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా
జీలకర్ర పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2 tsp
రాక్ సాల్ట్: ఒక చిటికెడు
ఉల్లిపాయ రింగ్స్: గార్నిష్ కోసం
కొత్తిమీర తరుగు: గార్నిష్ కోసం

Khatta Meetha Chana Chaat For Ramadan

తయారుచేయు విధానం:

1. ముందుగా కాబూలి శెనగలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. తర్వాత రోజు ఉదయం నీరు వంపేసి శుభ్రంగా కడిగా కుక్కర్ లో వేసి 4కప్పులు నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. శెనగలు ఉడికిన తర్వాత, స్టౌవ్ ఆప్ చేసి,కుక్కర్ లో ఆవిరి తగ్గే వరకూ పక్కన పెట్టుకోవాలి.
4. శెనగలు చల్లారిన తర్వాత, అదనపు నీరును వంపేసి,మరో గిన్నెలోకి మార్చుకోవాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, నిమ్మరసం, స్వీట్ టామరిండ్ చట్నీ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు అందులోనే రాక్ సాల్ట్, రోస్టెడ్ జీకలర్రపొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
8. అంతే చివరగా ఆనియన్ రింగ్స్ మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. కటామీటా చెన్నఛాట్ రెడీ. ఈ హెల్తీ ఛాట్ రిసిపిని ఇఫ్తార్ విందులో ఉపవాసం బ్రేక్ చేస్తూ తీసుకోవచ్చు.

English summary

Khatta Meetha Chana Chaat For Ramadan

As you fast for Ramadan, there are more recipes that we bring to you so that you can have a healthy and delightful Iftar meal in the evening. To add to the same list today we have a vegetarian chaat recipe which you can easily consume after keeping a fast for the whole day. It is nutritious, oil-free and a great treat for your taste-buds after a long day of fasting.
Story first published: Friday, July 11, 2014, 12:36 [IST]
Desktop Bottom Promotion