For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేతి-ఆలూ రైస్ బాత్ రిసిపి: హెల్తీ అండ్ టేస్టీ

|

వింటర్ చాలా అందమైన సమయంలో ఎందుకంటే, ఈ సీజన్ గ్రీన్ వెజిటేబుల్స్ అధికంగా అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో మొత్తం ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో నిండి ఉంటుంది . ఈ వెజిటేబుల్స్ ఉపయోగించి అనేక వెజిటేరియన్ వంటలను తయారుచేయవచ్చు.మెంతి ఆకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

అందువల్ల మెంతులను మరియు మెంతి ఆకులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధగుణాల వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు. ఎవరైతే హీమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారో, వారికి మెంతులు మరియు ఆకుకూరగను రెగ్యులర్ డైట్ లో ఏదోఒకవిధంగా చేర్చుకోవాలి. అంతే కాదు బంగాళదుంపలోని కార్బోహైడ్రేట్స్, మరియు స్ట్రార్చ్ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అందుకే మన ఇండియంన్ కుషన్స్ లో తాజా మెంతికూర, బేబీ పొటాటోలను ఉపయోగించి మేతి ఆలూ ఎక్కువగా తీసుకుంటారు. అంతే కాదు ఈహెల్తీ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ ప్రిపరేషన్ . బేబీ పొటాటాలో అందుబాటులో లేకపోతే సాధారణ బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది అధిక న్యూట్రీషిన్ ఫుడ్. మరి ఈ రెండింటి కాంబినేషన్లో రైస్ బాత్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4 (chopped)
మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped)
వండిన అన్నం: 3 cups (cooked)
ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup
వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit)
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
దాల్చిన చెక్క: 1 stick
లవంగాలు: 2-3
యాలకలు: 2
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో చిన్నటా కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, ఆలూ మేతి రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

English summary

Methi-Aloo Rice Bath Recipe: Healthy and Tasty Recips

Methi or fenugreek is a good source of iron. That is why fenugreek, both its seeds and leaves, are considered medicinal for curing anemia.
Story first published: Monday, December 14, 2015, 16:41 [IST]
Desktop Bottom Promotion