మిక్స్‌డ్ దోసె-పేరులోనే కాదు రుచిలో కూడా వెరైటీనే

By Sindhu
Subscribe to Boldsky

దోసె' సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్. దోసెలో కూడా వివిధ రకాలున్నాయి. ప్లెయిన్ దోసె, ఆనియన్ దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె, ఇలా... ఈ దోసెలు ఒక్కోరకమైన టేస్ట్ ను అందిస్తాయి. వీటితో పాటు మరో కొత్త రుచిని రుచిచూడాలిపిస్తే ఈ నీరు దోసె ప్రయత్నించవచ్చు. ఇది అన్ని రకాల దోసె ఐటమ్స్ కంటే కొంచె డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

పుల్లట్టు.. పేపర్ దోశ.. రవ్వదోశ.. అటుకుల అట్టు.. పేరులోనే కాదు, రుచిలో కూడా వెరైటీ ఉంది ఆ దోశలకు! చేవ చచ్చిన జిహ్వకు జీవం పోసే అద్భుతమైన రుచి వాటి సొంతం! అలాంటి కొన్ని డిఫంట్ దోశలతో ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించండి..

Mixed Dosa-Verity Dosa

కావలసిన పదార్థాలు:

గోధుమపిండి: 1cup

బియ్యం పిండి: 1cup

మైదాపిండి: 1cup

శనగపిండి: 1cup

జీలకర్ర: 1tbsp

ఉల్లిగడ్డ: 1

పచ్చిమిరపకాయలు: 2-4

కారం: 1tsp

ఉప్పు: రుచికి తగినంత

నూనె: సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా గోధుమపిండి, బియ్యం పిండి, మైదాపిండి, శనగపిండి అన్నింటిని బాగా కలపాలి.

2. తర్వాత అందులోనే కారం, ఉప్పు, జీలకర్ర వేసి నీళ్లు పోయాలి. మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి.

3. తర్వాత పాన్ మీద నూనె రాసి దోశ వేసుకోవాలి. పై నుంచి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చల్లుకోవాలి. కరకరలాడే.. మిక్స్‌డ్ దోశ రెడీ!

పుల్లట్టు.. పేపర్ దోశ.. రవ్వదోశ.. అటుకుల అట్టు.. పేరులోనే కాదు, రుచిలో కూడా వెరైటీ ఉంది ఆ దోశలకు! చేవ చచ్చిన జిహ్వకు జీవం పోసే అద్భుతమైన రుచి వాటి సొంతం! అలాంటి కొన్ని డిఫంట్ దోశలతో ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించండి..

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Mixed Dosa-Verity Dosa | పేరులోనే కాదు రుచిలో కూడా వెరైటీనే

    Dosa recipes are really popular in India. Although dosas are traditionally a part of South-Indian cuisine, today dosa are eaten all over India. In fact, dosas are now known as pan-Indian breakfast and served in almost all multi-cuisine restaurants. Dosas are not necessarily breakfast recipes. In South-India, people have dosa for their main meals too. But because dosa has become something of a fast food now, it can be prepared as a breakfast dish.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more