For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ హెల్తీ మిక్స్డ్ వెజిటేబుల్ దాల్మా రిసిపి

|

దాల్మా రిసిపి ఫేమస్ వెజిటేరియన్ రిసిపి. ముఖ్యంగా ఇది ఒడిస్సాలో చాలా ఫేమస్ అయిన వెజిటేరియన్ రిసిపి. ఇది చాలా సింపుల్ దాల్ రిసిపి, ఈ దాల్మా రిసిపిని ఏ సీజన్ లో అయినా తయారుచేసుకోవచ్చు. అయితే సీజన్ బట్టి, మనకు అందుబాటులో ఉండే కూరగాయలను ఈ కర్రీ తయారీకి ఉపయోగించాలి . ముఖ్యంగా ఈ దాల్మా రిసిపికి పచ్చిబొప్పాయి, పచ్చి అరటికాయ, బీన్స్, మునక్కాడ..మరికొన్ని ఇతర కూరగాయల ముక్కలను వేసి తయారుచేసుకోవచ్చు.

READ MORE: పెసరపప్పు మరియు బంగాళదుంప రిసిపి

ఈ దాల్మా రిసిపి తయారీ తర్వాత పోపు పెట్టడం, అందుకు వివిధ రకాల మసాలాలను ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసనతో డిఫరెంట్ టేస్ట్ తో నోరూరిస్తుంటుంది. ఈ దాల్మా రిసిపికి తక్కువగా ఆయిల్ ను ఉపయోగించడం వల్ల క్యాలరీలు తక్కువ బరువు కంట్రోల్ చేస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. మరింకెందుకు ఆలస్యం హెల్తీ అండ్ టేస్టీ దాల్మారిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mixed Vegetable Dalma Recipe: Indian Telugu Recipes


కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1/4cup
బీన్స్: 2
అరటికాయ: సగం
తీపిగుమ్మడికాయ: కొద్దిగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి
పచ్చిబొప్పాయి ముక్కలు: 1cup
ఆలూ ముక్కలు: 1/2cup
ములక్కాడ: 1
చేమదుంపలు: 2
టమోటోలు: 2
ఉల్లిపాయ: 1
జీలకర్ర: 2tsp
ఆవాలు: 1tbsp
పసుపు: 1/4tsp
బిర్యానీ ఆకులు: 2
ఎండుమిర్చి 3-4
వెజిటేబుల్ ఆయిల్: సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

READ MORE: దాల్ ఢోక్లి : గుజరాతీ స్పెషల్ దాల్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా కూరగాయలన్నింటినీ కడిగి మరింత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగో ఒక గిన్నెలో కందిపప్పును నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు రెండు చెంచాల జీలకర్ర మరియు రెండు ఎండుమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని, పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో కందిపప్పు, పసుపు వేయాలి.
5. కందిపప్పు సగం ఉడికిన తర్వాత అందులో ఉల్లిపాయ తప్ప మిగిలిన కాయగూర ముక్కలన్నీ వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలగలిపి మూత పెట్టేయాలి.

READ MORE: గ్రీన్ ట్రీట్: పెసరపప్పు ఆకుకూర కర్రీ
6. కొద్దిసేపటికి కూరముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యక అందులో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి వేయాలి.
8. ఇవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయముక్కలు బ్రౌన్ రంగులోకి మారేటప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేయాలి . పోపు మొత్తం వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న పప్పు, కూరముక్కలను పోపులో పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపెకోవాలి. అంతే దాల్మా రిసిపి రెడీ. ఇది వైట్ రైస్ లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Mixed Vegetable Dalma Recipe: Indian Telugu Recipes

Mixed Vegetable Dalma Recipe, Indian Telugu Recipes, Dalma is a very famous vegetarian recipe from the state of Odisha. It is an absolutely simple and fuss free dal recipe to try during the summer season. Dalma is basically cooked with a lot of vegetables such as unripe papaya, unripe banana etc.
Story first published: Monday, July 20, 2015, 12:29 [IST]
Desktop Bottom Promotion