For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్

|

గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ వింటర్. మార్కెట్లో, చిన్న చిన్నకూరగాయల అంగడిలో మొత్తం గ్రీన్ గ్రీన్ గా వెజిటేబుల్స్ కనబడుతుంటాయి. కాబట్టి, సీజనల్ గా దొరికే వివిధ రకాల కూరగాయాలను మర రెగ్యులర్ డైట్ లో పూర్తిగా చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి చేరాల్సి పోషకాశాలన్నీ అందుతాయి. ఒక్కో రకమైన కూరగాలతో వంట వండటం ఒక రుచి అయితే, మూడు, నాలుగు రకాల తాజా కూరగాయలు, వాటికి కొద్దిగా కూరాకు కూడా మిక్స్ చేస్తే చాలా అద్భుతమై రుచి ఉంటుంది.

మన ఇండియన్ స్టైల్ వంటే అయినే, సౌంత్ మరియు నార్త్ రిసిపిలు చాలా వెరైటీగా వేటికవే రుచిని కలిగి ఉంటాయి. సౌత్ వారికి నార్త్ వంటలు నచ్చితే, నార్త్ వారి సౌత్ వంటలు నచ్చుతాయి. మరి నార్త్ సైడ్ వంటల్లో ఒక అద్భుతమైన రుచికలిగిన సాధారణ వంట మిక్డ్స్ వెజిటేబుల్ సాంబార్. ఇది చాలా పాపులర్ రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం, మరియు చాలా తేలిక. మరి ఈ డెలిషియస్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mixed Vegetable Sambar

కావలసిన పదార్థాలు:
కూరగాయ ముక్కలు: 3cups(బెండకాయలు, టొమాటో, మునగకాడ, సొరకాయ, ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, దోస, తోటకూర)
చింతపండు: పెద్ద నిమ్మకాయంత(నానబెట్టి రసం తీయాలి)
ఉప్పు: తగినంత
నూనె: సరిపడా
పసుపు: 1/4tsp
ఇంగువ: 1/4tsp
రసం పొడి: 1tsp
ఎండు మిర్చి: 5
పచ్చి మిర్చి: 5(మధ్యకు పొడవుగా కట్ చేయాలి)
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
బియ్యప్పిండి: 1tbsp
బెల్లం పొడి: 1tbsp
కొత్తిమీర: చిన్న కట్ట
కరివేపాకు: 2రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా అన్ని కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు, నీళ్లు జత చేసి ఉడికించాలి.
2. తర్వాత చింతపండు రసం వేసి మరిగించాలి.
3. తర్వాత చిన్న పాన్ లో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వేయాలి.
4. కొద్దిసేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి మరోమారు కలపాలి. చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వేసి మరిగించాలి.
5. కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే మిక్డ్స్ వెజిటేబుల్ సాంబార్ రెడీ

Story first published: Saturday, August 23, 2014, 12:53 [IST]
Desktop Bottom Promotion