For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టగొడుగులు-పచ్చిబఠాణీ కర్రీ

|

Mushroom & Green peas curry
కావల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ -2
వెజిటబుల్ స్టాక్ - 2 cups
పచ్చి బఠాణీలు- 1 cup
పుట్టగొడుగులముక్కలు - 1 cup
పెరుగు - 1/2 cup
పాలు -1/2 cup
కొత్తిమీర - 1/4 cup
జీడిపప్పు - 2 tbsp
గసగసాలు - 2 tbsp
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిరప - 4
లవంగాలు - 2
వెల్లల్లి - 1
యాలకులు 2
అల్లం - 1

తయారు చేయువిదానం:

1. స్టౌ వెలిగించి పాన్‌లో మధ్యస్థంగా వుండే మంటపై నూనె వేసి వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి, కలయబెడుతూ బాగా వేయించాలి.
2. అందులో జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి కొత్తిమిర గ్రైన్డ్ చేసి పేస్ట్ ను రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పేస్టుని అందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉడికించాలి. బాగా కలయబెడుతూఅవసరమైతే కొద్దిగా నీళ్ళు పోయాలి.
3. తర్వాత ఉడికే మసాలాలో అరకప్పు వెజిటబుల్ స్టాక్ పోసి, ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.
4. మరొక కుక్కర్లో బఠాణీల వేసి ఉడికించి పెట్టుకొని దీనికి ఉప్పు, మిగతా వెజిటబుల్ స్టాక్ కలుపుకోవాలి. ఉడకడం ప్రారంభమయిన తర్వాత రుబ్బిన పేస్టు వేసి బఠాణీలు మెత్తబడేదాకా ఉడికించాలి. పుట్టగొడుగులు ముక్కలు, పాలు, పెరుగు, కలిపి మరో 5 నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే పుట్టగొడుగు, పచ్చిబఠాని కూర రెడీ. దీన్ని కొత్తిమీరతో అలంకరించాలి.

Story first published:Tuesday, November 10, 2009, 17:06 [IST]
Desktop Bottom Promotion