For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోరియాండర్(కొత్తిమీర)రైస్ బాత్

|

అన్నంతో మీరు వివిధ రకాల రైస్ బాత్ ఐటమ్స్ చేసుంటారు. అయితే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ అండ్ హెల్తీ రైస్ బాత్ రిసిపిని పరిచయం చేస్తున్నాం.

ఈ రైస్ బాత్ రిసిపి చాలా సింపుల్ మరియు ఈజీ రిసిపి. దీన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. ఈ వంటను బ్రేక్ ఫాస్ట్, మీల్స్ , డిన్నర్ దేనికైనా రెడీ చేసుకోవచ్చు. READ MORE: స్పైసీ టమోటో-పుదీనా పులావ్

ఈ వంటకు ముఖ్యంగా అవసరం అయినది కొత్తిమీ. ఇది ఆరోగ్యకరమైనది మరియు మంచి ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది. మరికెందుకు ఆలస్యం, హెల్తీ అండ్ టేస్టీ కోరియాండర్ రైస్ బాత్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Must Try Yummy Coriander Rice Bath: Telugu Vantalu


కావల్సిన పదార్థాలు:
అన్నం: 500 gms
కొత్తిమీర : 1కట్ట(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి: 4 to 5 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4 to 5
బిర్యానీ ఆకులు: 2
యాలకలు: 2-3
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 2-3
ఆవాలు: 1 tbs
కరివేపాకు : 5 to 8
కొబ్బరి తురుము: 1 small cup
నూనె: 3 tbs
ఉప్పు: రుచికి సరిపడా

READ MORE: మింట్ మటన్ బిర్యానీ-స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో బియ్యం కడిగిపెట్టుకొని, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి, మూడు విజిల్స్ వచ్చే వరకూ వండి పెట్టుకోవాలి.
2. అంతలోపు మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకులు, యాలకలు, లవంగాలు, కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి.
3. నీళ్ళు ఎక్కువగా పోయకుండా పొడిగానే గ్రైండ్ చేసి పెట్టుకోావలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేగనివ్వాలి.
5. పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో వేసి పెట్టుకొన్న కొత్తిమీర పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
6. మొత్తం మిశ్రమం ఐదు నిముషాలు వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. పోపు అన్నంకు పూర్తిగా పట్టే వరకూ మిక్స్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే కొత్తిమీర రైస్ బాత్ రెడీ.

English summary

Must Try Yummy Coriander Rice Bath: Telugu Vantalu

You might have tried different types of rice bath. But today, we shall teach you how to make yummy coriander rice bath. This dish is quite easy to prepare and consumes less time. You can prepare this recipe for Indian breakfast as many of the south Indian's prefer eating rice for breakfast. You can also have this as the main course.
Story first published: Thursday, August 6, 2015, 16:05 [IST]
Desktop Bottom Promotion