For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ మరియు పండ్లు: బరువు తగ్గించే రిసిపి

బరువు తగ్గించే వంటలేవైనా ఉన్నాయా అంటే? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఓట్స్ బాగా పాపులర్ అయినాయి. బరువు తగ్గించడంలో ఓట్స్ అద్భుతంగా సహాయపడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది, ముఖ

|

బరువు తగ్గించే వంటలేవైనా ఉన్నాయా అంటే? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఓట్స్ బాగా పాపులర్ అయినాయి. బరువు తగ్గించడంలో ఓట్స్ అద్భుతంగా సహాయపడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది, ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులు వారి బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది మరియు ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. మరియు ఇది పొట్ట నిండినట్లు అనుభూతిని కలిగిస్తుంది. ఓట్స్ లో అనేక న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగి ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Oatmeal With Fruits: Weight Loss Recipe

అయితే, ఎవరైతే ఓట్ మీల్ ను డిన్నర్ గా తీసుకుంటారో వారికి చాలా తేలికగా జీర్ణం అవుతాయి. అయితే ఓట్స్ ను వివిధ రకాలుగా ఎలా తయారుచేయాలో చాలా మందికి తెలియదు. సాధారణంగా ఓట్స్ లో పాలు మిక్స్ చేసి తీసుకుంటుంటారు. మరింత హెల్తీగా మరియు బరువు తగ్గించే వంటగా తయారుచేసుకోవాలంటే, ఓట్స్ లో మరికొన్ని పదార్థాలు, లేదా పండ్లు మిక్స్ చేసి తయారుచేసుకోవాలి. మరి ఈ వెయిట్ లాస్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
ఓట్స్ : 1cup
స్ట్రాబెర్రీ: 4-5(కట్ చేసుకోవాలి)
ఆపిల్: 1(కట్ చేసుకోవాలి)
అరటి పండు: 1(కట్ చేసుకోవాలి)
బాదం: గుప్పెడు
వాల్ నట్స్: 3-4
ద్రాక్ష: 1tsp
పంచదార: 1tsp
పాలు: 1cup

తయారుచేయు విధానం:
1. ఒక డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో పాలు పోసి, పంచదార వేసి బాగా మరిగించాలి.
2. పంచదార పూర్తిగా కరిగిపోయే వరకూ మరిగించాలి. ఇప్పుడు అందులో ఓట్స్ వేసి 5 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
3. 5నిముషాలు ఓట్స్ ను ఉడికించుకొన్న తర్వాత అందులో స్ట్రాబెర్రీస్, ఆపిల్స్, అరటిపండు ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేసేయాలి.
4. చివరగా వాల్ నట్స్, ఎండుద్రాక్ష, మరియు బాదంతో గార్నిష్ చేసి, వెంటనే సర్వ్ చేయండి. ఈ ఓట్స్, ఫ్రూట్స్ కాంబినేషన్ బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Oatmeal With Fruits: Weight Loss Recipe

To make your weight loss recipe all the more delicious and healthy, Boldsky has decided to add more ingredients. Here is a simple and quick oats recipe which is prepared using oats, milk, dry fruits and some delicious fruits. Take a look..
Desktop Bottom Promotion