ఉల్లిపాయ పకోడి కూర

Onion Pakoda Curry
కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు: 2(నిలువుగా తరగాలి)
సెనగపిండి: 2cups
బియ్యప్పిండి: 1tsp
కారం: రుచిక తగినంత
ఇంగువ: చిటికెడు
క్యాబేజీ తరుగు: 1/2cup
ఆవాలు: 1tsp
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup(సన్నగా తరగాలి)
కరివేపాకు: నాలుగు రెబ్బలు
అల్లం వెల్లుల్లి, టమోటో గుజ్జు: 1cup
కొబ్బరి పాలు: 1/4cup
గరంమసాలా: 1/2tsp
కొత్తిమీర: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా సెనగపిండిలో నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, బియ్యప్పిండి, ఇంగువ, క్యాబేజీ తరుగు కలిపి కొద్దిగా నీళ్లు చేర్చి పిండి కలుపుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి పిండిని పకోడీల్లా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత విడదీయాలి.
3. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలియతిప్పాలి.
4. కొద్దిసేపయ్యాక టమాటా గుజ్జు, కొబ్బరిపాలు, గరంమసాలా, ఉప్పు కలిపి మూతపెట్టాలి. గ్రీవీ సిద్దమయ్యాక పకోడీలుజోడించాలి.
అవి మొత్తబడ్డాక కొత్తిమీర చల్లి దించేస్తే సరిపోతుంది. దోశ, చపాతీల్లోకి ఈ కూర రుచిగా ఉంటుంది..

Story first published: Saturday, May 26, 2012, 12:57 [IST]
Desktop Bottom Promotion