For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ రైతా రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ

|

ఇండియన్ స్పెషల్ వంటకాల్లో పెరుగు పచ్చడి కూడా ఒకటి. ఇది సైడ్ డిష్ గానే కాదు. స్పెషల్ గా తయారు చేసుకొని గీ రైస్, జీరా రైస్, ప్లెయిన్ రైస్, రోటీలకు ఓ అద్భుతమైన కాంబినేషన్. ఆంధ్రా స్టైల్లో కొంచె స్పెషల్ గా, పెప్పర్, అల్లం చేర్చి వండటం వల్ల ఓ స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇండియన్ వంటకాల్లో రైతా చాలా ఫేమస్ సైడ్ డిష్. సాధారణంగా రైతాను నీళ్ళు-చిలికిన పెరుగు మిశ్రమం, కొన్ని స్పైసీ(మసాలా దినుసుల)తో తయారు చేస్తారు. రైతాకు మసాలాలను కలిపుకొని తయారు చేసుకోవచ్చు. లేదా తాజా కూరగాయలు ఉల్లిపాయలు, టమోటోలు, కీరకాయ, అవొకాడో వంటివి మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు.

అంతే కాదు, బూందీ చేర్చి స్వీట్ రైతాను కూడా తయారు చేసుకోవచ్చు. రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. అలాగే కొంత మంది పిల్లలు, పెద్దలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడకుండా ఉంటారు. అలాంటివారికి ఇలా సింపుల్ అండ్ టేస్ట్ పద్దతిలో అందిస్తే...వారికి ఆరోగ్యాన్ని అందించినవారమవుతాము. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు పాలక్ రైతాను కొద్దిగా డిఫరెంట్ గా ఎలా తయారుచేయాలో చూడండి....

 Palak Raita Recipe : Tasty and Healthy

కావలసిన పదార్థాలు:
పాలకూర : 1/2cup(ఒక కట్టను సన్నగా తరిగిపెట్టుకోవాలి)
చిక్కటి పెరుగు : 2cup
పచ్చి మిర్చి : 4(మిక్సీలో వేసి మెత్తగా చేయాలి లేదా సన్నగా తరిగిపెట్టుకోవచ్చు)
శనగపప్పు : 1tsp
మినప్పప్పు : 1tsp
ఆవాలు : 1tsp
జీలకర్ర : 1/2tsp
ఎండు మిర్చి : 6
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
మిరియాలు, జీలకర్ర పొడి : 1/2tsp
నూనె : 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూరను శుభ్రం చేసుకొని, వేడినీటిలో వేసి అదునిముషాల తర్వాత తీసేయాలి. మెత్తగా ఉడికించకూడదు. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఆకుకూర లైట్ గా వేయించి పక్కన ఉంచాలి.
2. తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి.
3. ఇప్పుడు మరో డ్రీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి.
4. అంతులోపు చిలకించిన పెరుగులో... వేయించి ఉంచుకున్న ఆకుకూర తురుము వేసి కలపాలి.
5. తర్వాత అలాగే వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి.
6. చివరగా మిరియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే పాలక్ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి చాలా బాగుంటుంది.

English summary

Palak Raita Recipe : Tasty and Healthy

Palak raita is a cooling delicacy. This raita is a healthy option as spinach is rich in iron and vitamins and curd is rich in calcium. Also this recipe helps to keep your body temperature low in this scorching season.
Story first published: Monday, January 4, 2016, 13:51 [IST]
Desktop Bottom Promotion