Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పనీర్ ఫ్రైడ్ రైస్ : టేస్టీ అండ్ హెల్తీ
వెజిటేరియన్స్ కు పనీర్ ఒక అత్యంత ముఖ్యమైన ఆహారంగా మారింది. చాలా వరకూ ప్రతి ఒక్కరూ మెనులో పనీర్ ను ఒక ఉత్తమ ఎంపికగా పెట్టుకొని, పార్టీల్లో అద్భుతమైన రుచికరమైన వంటల్లో ఇది ఒకటిచా ఎంపిక చేసుకుంటారు. మరి పనీర్ రుచిచూడాలనుకొనే వారికోసం, ఈరోజు ఒక అద్భుతమైను రుచికరమైన పనీర్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వంటకు పనీర్ తో పాటు, క్యారెట్,క్యాప్సికమ్, గ్రీన్ పీస్, వంటివాటిని కూడా చేర్చుతున్నాం.
చల్లగా ఉండే ఈ శీతాకాలంలో వేడి వేడిగా రైస్ వెరైటీస్ నోరూరిస్తాయి. ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. కొంచెం స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది.

కావలసిన పదార్ధాలు:
పనీర్ : 2cups
బాస్మతి బియ్యం : 2cups
క్యాప్సికమ్ : 1
పచ్చిబఠాణి : 1/2
కొబ్బరి తురుము : చిన్న కప్పు
క్యారట్ తురుము : చిన్న కప్పు
ఉల్లికాడల తురుము : చిన్న కప్పు
జీడిపప్పు : 10
చిల్లీ సాస్ : 1tsp
టొమాటో సాస్ : 1tsp
అల్లం వెల్లుల్లి ముద్ద : 1tsp
గరం మసాలా పొడి : 1/2tsp
మిరియాల పొడి : 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
అజినోమాటో : చిటికెడు
నూనె : 50grm
తయారు చేయు విధానం :
1. ముందుగా బాస్మతి బియ్యం కడిగి కాస్త పలుకుగా(పొడిపొడిగా) వండి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పనీర్ ను అంగుళం ముక్కలుగా కోసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి బౌల్ లోకి తీసుకున్న పనీర్ ను ముక్కలను, జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో మరలా కొద్దిగా నూనె వేసి అది వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
5. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కొంచెం చేపు వేయించాలి.
6. ఆ తర్వాత చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేపాలి.
7. ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకొన్న పనీర్, జీడిపప్పు ముక్కలు, అజినోమాటో, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలిసేలా కలబెట్టాలి. చివరగా తరిగిన కొత్తిమిర, తురిమిన కొబ్బరి కూడా చల్లి ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే నోరూరించే ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications