For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ ఆలూ గ్రేవీ :రోటీ, రైస్, చపాతీలకు బెస్ట్ కాంబినేషన్

|

వెజిటేరియన్ డైట్ లో పన్నీర్ అధిక ప్రాధాన్యం ఇచ్చే ఒక డిష్. డైరీ ప్రొడక్ట్(పన్నీర్)చాలా అద్భుతంగా ఉంటుంది మరియు దీంతో స్నాక్స్ మరియు ప్రధానమైన రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. పనీర్ తో తయారు చేసే షీవర్స్ నుండి కర్రీస్ వరకూ లెక్కలేనన్ని వంటలు ఉన్నాయి. మరి మీకు కూడా పన్నీర్ వంటకాలంటే ఇష్టం అయితే. కొన్ని వంటలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు ఒక అద్భుతమమైన టేస్ట్ కలిగిన పనీర్ పొటాటో గ్రేవీ ఉంది.

పన్నీర్ వంటలు తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, చాలా కారంగా తయారు చేయాలని అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ పనీర్ పొటాటో గ్రేవీ, చాలా సులభంగా అతి తక్కువ సమయంలో టేస్టీగాత తయారు చేయవచ్చు. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

Paneer Potato Gravy Recipe
  • పనీర్: 250gms (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • ఆలూ : 3లేదా 4(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • ఉల్లిపాయ: 2
  • టమోటా 2
  • పసుపు: 1tsp
  • కారం: 1tsp
  • గరం మసాలా: ½tsp
  • పచ్చిమిరపకాయలు: 4
  • టమోటా సాస్: 1tsp
  • బిర్యానీ ఆకు: 1
  • జీలకర్ర: ½tsp
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి మంట మీడియంగా పెట్టి 5-10నిముషాలు వేగించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు బంగాళదుంప ముక్కలను కూడా కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని, కుక్కర్ లో వేసి ఒకటి విజిల్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీలో ఉల్లిపాయ, మరియు పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. తర్వాత అదే ఫ్రైయింగ్ పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
6. అంతలోపు టమోటోను గుజ్జుగా తయారు చేసుకోవాలి(మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి)
7. తర్వాత వేగుతున్న మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, పసుపు వేయడం వల్ల టమోటో త్వరగా ఉడుకుతుంది.
8. ఒకసారి గా ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ కు మారగానే, టమోటో గుజ్జును అందులో వేయాలి. అలాగే కారం, టమోటో సాస్, మరియు గరం మసాలా వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
9. ఎక్కువ మంట పెట్టి 2-3నిముషాలు ఉడకనివ్వాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, అందులో పన్నీర్ క్యూబ్స్, ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే పన్నీర్ ఆలూ గ్రేవీ రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిస్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. రోటీ, రైస్, చపాతీలకు మంచి కాంబినేష్.

English summary

Paneer Potato Gravy Recipe

Paneer is one of the most preferred dish in a vegetarian diet. The dairy product is delicious and can be used to prepare snacks and main course dishes. From skewers to curries, paneer dishes are countless. If you love paneer and want to try some recipes at home for a delicious meal, then you can prepare paneer in tomato gravy.
Story first published:Wednesday, April 27, 2016, 12:45 [IST]
Desktop Bottom Promotion