For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయ బూరెలు

|

Pumpkin Burelu
కావలసిన పదార్థములు:
గుమ్మడికాయ -1 చిన్నది
వరిపిండి (రెడ్ కలర్ బియ్యపు పిండి) - ఒక కప్పు
బెల్లం -250 గ్రా
ఏలకలు -4
నూనె- సరిపడు

తయారు చేయు విధానము:

గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో గుమ్మడికాయ ముక్కలను వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నీటిని వంపేసి గుమ్మడి ముక్కలను పక్కకు తీసి ఆరిన తర్వాత చిదిమి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో కొద్దిగా నీరు పోసి ఒక కప్పు బెల్లం వేసి పాకం వచ్చేలా సన్నని మంటమీద కాగనివ్వాలి. బెల్లం పాకం తయారైన తర్వాత అందులో వరిపిండిని, చిదిమి పెట్టుకొన్న గుమ్మడికాయను, ఏలకులు పొడి జత చేసి గట్టిపడేలా కలుపుకొవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేగించడానికి కావలసినంత నూనె వేసి సన్నని మంట మీద కాగనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకొన్న గుమ్మడి ముద్దలోనుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కాగే నూనెలో వెసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించి తీసేయాలి అంతే వేడి వేడి గుమ్మడి బూరెలు రెడీ.

Story first published:Wednesday, October 7, 2009, 18:35 [IST]
Desktop Bottom Promotion