For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయ కర్రీ: మీల్ స్పెషల్

|

గుమ్మడికాయ వంటల గురించి నేటితరం పిల్లలకు పెద్దగా తెలీదు. కారణం గుమ్మడి వంటలు బాగా తగ్గిపోవడమే. ముద్ద పప్పు, గుమ్మడికాయ పులుసులాంటి సాంప్రదాయ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఏ కిచెన్‌లోనూ కనిపించడం లేదు. పప్పు, పులుసు అవుట్‌డేటెడ్. కొత్తదేమైనా ఉంటే చెప్పండంటున్నారు నేటితరం ఆహారప్రియులు.

గుమ్మడితో ఏరకమైన వంట వండినా చాలా టేస్ట్ గా ఉంటుంది. అంతే కాదు, ఆరోగ్యం విలువలు కూడా ఎక్కువే. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. గుమ్మడితో చేసిన వంటకాలు తినండి...కడుపులో కూడా దిష్టి పోయి హాయిగా ఉంటుంది. ఇంటికీ, ఒంటికీ మంచి చేసే గుమ్మడి ఎప్పుడు వండుకుంటే అప్పుడే పండగ! గుమ్మడికాయ లాంటి మీ ‘ఫ్యామిలీ' కోసం ఈ రోజు ఘుమ్మడి ట్రీట్ తో ఎంజాయ్ చేయండి!!

Pumpkin Curry : Meal Special

కావల్సిన పదార్థాలు:
గుమ్మడికాయ: 1(మీడియం సైజ్, ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మెంతి (మెంతులు) : 1tbsp
పసుపు పొడి: ½tsp
వేగించిన జీలకర్ర పొడి: 1tsp
డ్రై మాంగో పొడి: 2tsp
బెల్లం తురుము: 1tbsp
కొత్తిమీర ఆకులు: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: 1tbsp
నీళ్ళు:1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేసుకొని, కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి మెంతులను వేసి అరనిముషం వేగించుకోవాలి.
3. ఇప్పుడు మెంతులు బ్రౌన్ కలర్ లోకి మారగానే అందులో గుమ్మడి ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అందులో రోస్ట్ చేసి పెట్టుకొన్న జీలకర్ర, ఉప్పు, డ్రై మ్యాంగో పౌడర్, పసుపు, వేసి మీడియం మంట మీద 5 ఉడకించుకోవాలి.
5. ఐదు నిముషాల తర్వాత బెల్లం తురుము మరియు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత పూత పెట్టి మరో 5-10నిముషాలు పాటు ఉడికించుకోవాలి.
6. ఇలా పూర్తిగా ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే స్వీట్ అండ్ టాంగీ గుమ్మడి కర్రీ రెడీ.

English summary

Pumpkin Curry : Meal Special

It is the fourth day of Dhusara and the fasting is on. It is difficult to think of new dishes everyday which can be consumed during the fast. Eating the same aloo sabji everyday can get extremely monotonous. So, change your taste with this simple, sweet and tangy pumpkin curry.
Story first published: Monday, September 22, 2014, 14:21 [IST]
Desktop Bottom Promotion