For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ ఈజీ ఆలూ గోభీ మసాలా

|

కొన్ని సందర్భాల్లో మనందరికి చాలా త్వరగా ఈజీగా తయారయ్యే వంటలు చేయాల్సి వస్తుంది. అయితే, ఎప్పుడూ చేసే వంటలే చేస్తే బోరుకొడుతుండి. అలా టేస్టీగా మరియు త్వరగా తయారయ్యే వంటల్లో ఆలూ గోబి వంట ఒకటి. ఈ వంటకు ఉపయోగించే పదార్థాలు చాలా త్వరగా ఉడుకుతాయి . త్వరగా వంట తయారవుతుంది.

అంతే కాదు టేస్ట్ బడ్స్ ను కూడా సంతృప్తి పరుస్తుంది. కాబట్టి, ఇది మైండ్ లో ఉంచుకొని, అతి త్వరగా మరియు టేస్టీగా తయారయ్యే ఆలూ గోబిని ఎలా తయారుచేయాలో క్రింది వీడియో ద్వారా తెలుసుకోవచ్చు...

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTY5ODQ5fHwxMDA1fHwwfHx8fHx8";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్: 1(మీడియం సైజ్, ఉడికించిన మరియు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బంగాళదుంపలు: 4 (ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి)
పచ్చిబఠానీ: 1/2cup(ఉడికించినవి)
ఆయిల్ : 2 tbsp
జీలకర్ర : 2 tsp
ఇంగువ పొడి : 1 1/2 tsp
ఉల్లిపాయ : 3 (సన్నగా తరిగినవి)
అల్లం: 1 చిన్న ముక్క (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-7(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటోలు : 3 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు పొడి : 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం : 1tsp
ధనియా పౌడర్ : 1 1/2 tsp
జీలకర్ర పొడి: 1 1/2 tsp
డ్రై మ్యాంగో పౌడర్ : 1 tsp
కొత్తిమీర : 2tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

Quick & Tasty Aloo Gobhi Masala Recipe (With Video)

తయారుచేయు విధానం :
1. ముందుగా ఒక సాస్ పాన్ తీసుకొని , అందులో జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
2. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి మరియు టమోటో ముక్కలు వేయాలి .
3. అలాగే పసుపు మరియు ఉప్పు కూడా వేసి తక్కువ మంట మీద వేగించుకోవాలి.
4. టమోటోలు మెత్తగా ఉడికే వరకూ వేగించి, ఆతర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న బంగాళదుంప ముక్కలు మరియు కాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత వెంటనే పచ్చిబఠానీలకు కూడా వేసి మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి మరియు డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. అలా పది నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
8. అంతే స్టౌ ఆఫ్ చేసి, చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ స్పెషల్ వెజిటేరియన్ రిసి రోటీ మరియు పరోటాలకు చాలా మంచి టేస్టీ కాంబినేషన్.

English summary

Quick & Tasty Aloo Gobhi Masala Recipe (With Video)

We all need quick recipes during the weekdays because of our busy lives. We need things that can be cooked in minutes so that we eat healthy and save on the time too. This often leads us to compromise on the taste part. But your taste-buds are equally important and they need to be kept satiated.
Desktop Bottom Promotion