For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ రైంబో ఇడ్లీ

|

సాధారణంగా ఇండియన్ సాంప్రధాయంలో ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ చాలా ఫేమస్. అంతే కాదు. ఇడ్లీను చాలా వెరైటీలుగా చేస్తారు. రవ్వతో చేస్తారు. రైస్ తో చేస్తారు. ఉప్మా ఇడ్లీ ఇలా రకరకాలుగా చేస్తారు. ఈ రైబో ఇడ్లీ కూడా అంతే వెరైటీగా చేయబడింది. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతో కలర్ కలర్ గా కనిపించే ఈ ఇడ్లీకి కొబ్బరి చట్నీ చక్కటి కాంబినేషన్ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తయారు చేసుకొని తినవచ్చు. పిండిని పులయబెట్టనవసరం లేదు. అంతే కాకుండా ఓట్స్, గోధుమ రవ్వ చేర్చడంతో ఆరోగ్యానికి మరింత మంచిది. ఇందులో క్యాలరీలు, ప్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి సరిపోయే బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు.

Rainbow Idli-Low Fat Special Breakfast

కావలసిన పదార్థాలు:
ఓట్స్: 1cup
పెరుగు: 1/2cup
గోధుమరవ్వ: 1/2cup
క్యారెట్‌ తురుము: 2tbsp
అల్లం తురుము: 1tsp
పచ్చిమిరపకాయలు: 4
కొత్తిమీర తురుము: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మకాయరసం: 1tbsp
నీళ్లు: సరిపడా
ఆవాలు: 1tsp
శనగపప్పు: 1tbsp
మినపప్పు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని పొడిచేసుకోవాలి. ఇందులో గోధుమరవ్వ కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనెపోసి ఆవాలు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కాయలు వేసి వేయించాలి.
3. తరువాత క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసి వేయించి తీసేయాలి. దీన్ని ఓట్స్‌పొడిలో వేసి బాగా కలపాలి.
4. తర్వాత నీళ్లు, పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ పిండితో అప్పటికప్పుడే ఇడ్లీలు వేసుకోవచ్చు. పులవాల్సిన పనిలేదు. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే రైంబో ఇడ్లీ రెడీ

English summary

Rainbow Idli-Low Fat Special Breakfast | లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ రైంబో ఇడ్లీ


 To really get rainbow idli combinations, both in appearance and taste, you can develop chatni variations for a variety of colors. Traditionally, Idli has only few morphemic variations: rice idli and rava (soji) idli. Here are creative idli recipes: Idli with embedded chatni Generally idli is served with coconut or chana chatni. Some lazy cooks serve idli with chatni powder or pickle. Idli is also served with saambaar.
Desktop Bottom Promotion