For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్: టేస్టీ అండ్ హెల్తీ...

|

బరువు తగ్గాలని కోరుకొనే వారు చికెన్ గ్రిల్ చేసి లేదా ఫ్రై చేసి రైస్ తో పాటు తీసుకోవచ్చు. ఈ లెమన్ రైస్ రిసిపి రుచిలో అద్బుతంగా ఉంటుంది. అందుకు ముందుగా చికెన్ ను గ్రిల్ చేయడం లేదా ఫ్రై చేయడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్ వస్తుంది.

రోస్టెడ్ చికెన్ కు లెమన్ జోడించడం వల్ల ఫ్రైడ్ రైస్ కు మరింత టేస్ట్ ను జోడించడంతో పాటు, లెమన్ క్యాలరీలను కరిగిస్తుంది. ముఖ్యంగా లెమన్ రైస్ ను వేసవి సీజన్ లో ఎక్కువగా తింటారు. అందుకు ముఖ్య కారణం వేసవి సీజన్ లో బాడీ హీట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు లెమన్ వల్ల వంటకు మంచి ఫ్లేవర్ అందిస్తుంది. మరి ఈ యమ్మీ ట్రీట్ ను తయారుచేయడానికి ఏమేమి కావాలి? ఎలా తయారుచేయాలి తెలుసుకుందాం....

Roasted Chicken Lemon Rice Recipe


కావల్సిన పదార్థాలు:
రైస్- 1 cup( వండిపెట్టుకొన్న అన్నం)
బోన్ లెస్ చికెన్ - 500 gms(పెప్పర్ రోస్ట్ )
నిమ్మరసం- 4 tbsp
పసుపు - ½ tsp
కరివేపాకు - 5 nos
ఉల్లిపాయలు- 1 (chopped)
ఆవాలు - 1 tbsp
పచ్చిమిర్చి- 1 (sliced)
నూనె- 2 tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
2. తర్వాత అందులో పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి ఒక సెకను వేగించుకోవాలి. పోపు పదార్థాలను ఎప్పుడూ చాలా తక్కువ మంటలో
3. తర్వాత అందులో పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులో పెప్పర్ రోస్ట్ చేసి బోన్ లెస్ చికెన్ వేసి పోపుతో పాటు వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఫ్రై చేసుకోవాలి.ః
6. మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు చిలకరించి మిక్స్ చేయాలి.
7. చివరగా ఫ్రైడ్ రైస్ మొత్తం మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు ఉండనిచ్చి తర్వాత స్టౌఆఫ్ చేయాలి.

English summary

Roasted Chicken Lemon Rice Recipe

Chicken is a preferred ingredient among those who want to lose weight. When you add chicken to any rice item it should be grilled or fried first with rich spices. This lemon rice recipe is unique in nature as it contains meat. Lemon rice is usually eaten during summer as it helps to cool the body heat. This rice recipe is made with chicken to create a unique flavour which I am sure will be loved by all non-vegetarians.ః
Story first published: Tuesday, June 9, 2015, 15:23 [IST]
Desktop Bottom Promotion