For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ అండ్ హెల్తీ సలాడ్ రిసిపి

|

వేసవిలో చాలా వరకు అన్ని రకాల పండ్లు దొరుకుతాయి. ముఖ్యంగా శరీరాన్ని కూల్ గా ఉంచే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఉదా: పచ్చకాయ, దోసకాయ, కీరకాయ వంటవి శరీరానికి తగినంత చల్లదాన్ని అంధిస్తాయి. వేసవిలో అధిక వేడి, ఎండల వల్ల మన శరీరంను కాపాడుకోవడానికి ఇటువంటి పండ్లను తప్పని సరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే సన్ టాన్, వడదెబ్బ నుండా మన శరీరాన్ని చర్మాన్ని రక్షించుకోగలుగుతాము.

ఎండాకాలంలో చల్లచల్లని సలాడ్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యం మాత్రమే కాదు, రుచికి కూడా బాగుంటాయి. పండ్లు తినని పిల్లలకు సలాడ్ ల రూపంలో చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్ లలో పోషక విలువలు కూడా అధికం. వేసవి తాపానికి భోజనం చేయాలన్నా, చపాతీలు తిన్నాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకున్న ఈ సలాడ్ లను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.. మరి మీరు ఈ సలాడ్ ల రుచి ఏమిటో ఒక సారి చూడండి...

Simple And Healthy Salad Recipe

కావల్సినపదార్థాలు:
పచ్చిమామిడికాయ- 1/2 cup ( finely chopped)
కీరదోస - 1/2 cup ( finely chopped)
స్ట్రాబెర్రీ- 1/2 cup ( finely chopped)
వాటర్ మెలోన్- 1/2 cup ( finely chopped)
మస్క్ మెలోన్- 1/2 cup ( finely chopped)
అరటి- 1/2 cup ( finely chopped)
ద్రాక్ష- 1/2 cup ( finely chopped)
ఆరెంజ్- 1/2 cup ( finely chopped)
పెప్పర్ - 1/2 Teaspoon
డ్రైమ్యాంగో పొడి - 1/2 Teaspoon
నిమ్మరసం - 1/2 Teaspoon
తేనె - 2 Teaspoon
పుదీనా ఆకులు - 5 to 6
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పెద్ద బౌల్ తీసుకొని అందులో పదార్థాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
2. తర్వాత అందులో పెప్పర్, ఆమ్ చూర్ పౌడర్, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
3. అందులో ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి.
4. తర్వాత అవసరం అయితే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేయాలి.
5. గార్నిషింగ్ గా కొద్దిగా పుదీనా ఆకులు వేసి సర్వ్ చేయాలి.
6. మంచి ఫ్లేవర్ రిఫ్రెష్ నెస్ తో హెల్తీ సలాడ్ రిసిపి రెడీ .

English summary

Simple And Healthy Salad Recipe

It is always important to stay healthy. And the only way to stay healthy is to eat healthy. So, eating the right food is very important. Though several varieties of healthy foods are available, people want tasty foods and always opt for unhealthy food items.
Story first published:Saturday, April 30, 2016, 12:46 [IST]
Desktop Bottom Promotion