For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌత్ ఇండియన్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ

|

ఆలూ(బంగాళదుంప) మరియు క్యాప్సికమ్ రెండింటిని ఇండియన్ కుషన్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఆలూ మరియు క్యాప్సికమ్ కాంబినేషన్ రిసిపి నార్త్ ఇండియన్ కర్రీ.

ఈ వంటను చాలా సులభంగా తయారుచేయడం మాత్రమే కాదు, చాలా రుచికరమైనది కూడా. మరి ఈ సింపుల్ ఇండియన్ కర్రీని ఎలా తయారుచేయాలో ఈక్రింది పద్దతిని అనుసరించండి...

aloo capsicum

కావల్సిన పదార్థాలు:
మీడియం సైజ్ బంగాళాదుంపలు: 2 (ఉడికించిన: ఒలిచిన మరియు ముక్కలుగా కట్ చేసినవి)
మీడియం కాప్సికమ్స్: 3
మీడియం ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
మీడియం టమోటా: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీడిపప్పు: 2tbsp
అల్లం: 1/2tsp(తురిమినది)
వెల్లుల్లి: 3-4
డ్రై ధనియాలు: 1tsp
జీలకర్ర: 1/4tsp
గరం మసాల: 1/2tsp
కారం: 1 tsp
పసుపుపొడి:1/2tsp
ఆయిల్: 2 ½ tbsps
చక్కెర: 1tsp
నీరు: 1/4cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా టమోటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తగా చేసుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో క్యాప్సికమ్ వేసి చిటికెడు ఉప్పు చిలకరించి మీడియం మంట మీద 5నిముషాలు వేయించుకోవాలి. వేయించుకొన్న తర్వాత వేరే ప్లేట్ లోనికి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిగిలిన నూనె కూడా పాన్ లోనే వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులోనే గరం మసాలా మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ముందుగా తయారుచేసుకొన్న మసాలా పేస్ట్ ను, ఉప్పు, మరియు పంచదార వేసి అతి తక్కువ మంట మీద వేయించుకోవాలి.నూనె పైకి తేలే వరకూ (5-10నిముషాలు పడుతుంది)వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి, పొట్టుతీసికట్ చేసి పెట్టుకొన్న బంగాలదుంప ముక్కలు వేయించుకొన్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో 1/4నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. 5నిముషాలు లేదా గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోనికి మార్చుకోవాలి.
8. ఈ గ్రీవీ మరింత స్పైసీ గా ఉండాలనుకొంటే అందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని తందూరీ రోటీ, చపాతీ, బట్టర్ నాన్ లేదా అన్నంతో సర్వ్ చేయవచ్చు.

English summary

South Indian Aloo Capsicum Recipe

Aloo and capsicum are two main ingredients of Indian cooking and make many delicious dishes and curries. Aloo capsicum is one such North Indian curry, which is not just easy to prepare but very palatable too.
Desktop Bottom Promotion