For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ సాంబార్ : మిక్స్డ్ పల్స్ సాంబార్ రిసిపి

By Super Admin
|

ఇప్పుడు భోజన సమయంలో , అయితే భోజనానికి హెల్తీగా మరియు టీస్టీగా ఏం వండాలనుకుంటున్నారా? మద్యహ్నా బోజనానికి ఎలాంటి శాఖాహార వంటకమైతే టేస్టీగా మరియు హెల్తీగా ఉంటుంది.

సహజంగా, సాంబార్ అంటేనే వివిధ రకాల వెజిటేబుల్స్ వేసి తయారుచేస్తుంటారు. అయితే, మనం ఈ రోజు వెజిటేబుల్స్ తగ్గించి, పప్పుదినుసులు ఎక్కవ జోడించి తయారుచేసుకుందాం. ఈ వంటలో వివిధ రకాల పప్పుదినుసులు జోడించడం వల్ల ఇది అత్యంత పోషక విలువలు కలిగినదిగా ఉంటుంది. ఈ వంటకు పెసలు, ఉలవలు, శెనగలతో పాటు, వంకాయ చేర్చడం వల్ల మరింత టేస్టీగా ుంటుంది.

ధాన్యాలు లేదా పప్పుదినుసులు వీటిని లెగ్యుమ్స్ అనికూడా పిలుస్తారు. ఇవి మన శరీర ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనవి. ఇవి హార్ట్ హెల్త్ కు చాలా మంచిది . వీటిలో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, డయాబెటిక్ రిస్క్ ను తగ్గిస్తాయి . అయితే ఈ రోజు లంచ్ కు టేస్టీ అండ్ హెల్తీ రిసిపిని తయారుచేసి ఎంజామ్ చేయండి....

Special Mixed Pulses Sambar Recipe

కావల్సిన పదార్థాలు:

ఉలవలు - 1/2 కప్పు

ముడి పెసలు - 1/2 కప్పు

శెనగలు - 1/2 కప్పు

వంకాయలు - 3 to 4 (సన్నగా తరిగినవి)

ఉల్లిపాయలు- 2 (సన్నగా తరిగినవి)

ఆవాలు - 1/4 టీస్పూన్

కొబ్బరి తురుము - 1/2 కప్పు

ధనియాలు - 1/2 టీస్పూన్

కారం - 3 టీస్పూన్

బెల్లం - 1/4 టీస్పూన్

చింతపండు - 1/4 టీస్పూన్

కరివేపాకు - 8 to 10

నూనె: సరిపడా

ఉప్పు: రుచికి తగినంత

తయారీ:

1. పెసలు, వెనగలు, ఉలవలను నీటిలో వేసి రాత్రంత నానబెట్టుకోవాలి లేదా వేడి నీటిలో 2 గంటలు నానబెడితే సరిపోతుంది.

2. గింజలను 2 గంటలసేపు నానెబట్టిన తర్వాత నీరు వపంేసి ప్రెజర్ కుక్కర్ లో వేసి వేరే నీరు పోసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. గింజలు ఉడికే లోపు మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, చింతపండు, కారం, బెల్లం, ధనియాలు మరియు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు ఒక కుక్కింగ్ బౌల్ స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

5. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు మరియు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.

6.ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

7. ఉల్లిపాయ, వంకాయ ముక్కలు వేగిన తర్ాత అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి మిక్స్ చేస్తూ ఐదునిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సరిపడా నీరు పోయాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఉడికించుకోవాలి.

8. రుచికి సరిపడా ఉప్పు వేసి కలబెట్టి, పది నుండి పదిహేను నిముషాలు ఉడికించుకోవాలి.

9. సాంబార్ బాగా ఉడికి, చిక్కబడే సమయంలో , స్టౌఫ్ ఆఫ్ చేయాలి. అంతే మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ రిసిపి రెడీ ఇది రైస్ కు మంచి కాంబినేషన్ . మీరు కూడా ఈ సాంబార్ రిసిపిని ట్రై చేసి మీ అభిప్రాయం కూడా మాకు తెలపండి..

English summary

Special Mixed Pulses Sambar Recipe

It's lunch time and do you wish to prepare something healthy and tasty? Well, we're talking of a vegetarian recipe. Today is the day you should try this, as we feel it is ideal to eat right and stay fit and what better than having a healthy lunch at home, right?
Story first published: Monday, July 25, 2016, 11:11 [IST]
Desktop Bottom Promotion