For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ గ్రీన్ గ్రామ్ (ముడి పెసళ్ళు)మసాలా రిసిపి

|

గ్రీన్ గ్రామ్ (ముడి పెసళ్ళు)మసాలా తయారుచేయడం చాలా సులభం మరియు ఇది ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన సౌత్ ఇండియన్ డిష్. దీన్ని చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు . ఈ గ్రీన్ గ్రామ్ కర్రీ చపాతీలకు మంచి కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేషన్ నార్త్ మరియు సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. నార్త్ లో వీటిని గ్రీన్ మూంగ్ దాల్ అనిపిలుస్తారు.

ఎప్పుడు చేసినటువంటి వంటలే, కందిపప్పు, పప్పు చారు బోరుకొడుతున్నప్పుడు, ఇలాంటి సింపుల్ వంటలను ప్రయత్నించవచ్చు . ఇవి డిఫరెంట్ టేస్ట్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటాయి . ఈ గ్రీన్ గ్రామ్ మసాలా కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి స్పైసీగా తయారుచేస్తారు. చాలా త్వరగా మరియు సులభంగా తయారుచేస్తారు. మీ రుచికి తగ్గట్టు మసాలాను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. గ్రీన్ గ్రామ్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. మీరు అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మీ రెగ్యురల్ డైట్ లో గ్రీన్ గ్రామ్ చేర్చుకోండి. మరి గ్రీన్ గ్రామ్ మసాలా కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Green Gram Masala Recipe

కావల్సిన పదార్థాలు:
గ్రీన్ గ్రామ్(ముడి పెసళ్ళు: 1cup
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లల్లి పేస్ట్ : 2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 6-7
పచ్చిమిర్చి: 3-4
లవంగాలు: 3
కారం: 1tbsp
పసుపు: 1tbsp
నూనె: 3-4tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా గ్రీన్ గ్రామ్ (ముడి పెసళ్ళును)శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్ లో వేసి 2-3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత ఒక తవా తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో లవంగాలు వేసి ఒక సెకన్ వేగించాలి. ఆరోమా వాసన వస్తుంది.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్త మిశ్రమాన్ని వేగించాలి.
4. ఉల్లిపాయలు మొత్తగా వేగిన తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గ్రీన్ గ్రామ్ వేయాలి, అలాగే ఉడికించిన నీరు కూడా అందులో పోయాలి. మీకు ఇంకా అవసరం అనిపిస్తే మరికొద్దిగా నీరు మిక్స్ చేసుకోవచ్చు .
6. తర్వాత మూత పెట్టి గ్రేవీ చిక్కబడే వరుకూ ఉడికించుకోవాలి. అంతే స్పైసీ గ్రీన్ గ్రామ్ మసాలా రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

English summary

Spicy Green Gram Masala Recipe

Recipe for green gram masala is simple, and this Indian dish can be prepared quickly. The green gram dal curry for chapathi is popular in south and north India alike. It is called green moong dal in north India. If you are tired of having the same dal recipes, and want to try something different, then check out the recipe for green gram masala.
Story first published: Monday, November 17, 2014, 18:06 [IST]
Desktop Bottom Promotion