For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ పనీర్ బిర్యానీ: వెజిటేరియన్ స్పెషల్

|

పనీర్ వంటలంటే అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ అంటే అమితమైన ఇష్టం. ఎందుకంటే ఇది పూర్తిగా న్యూట్రీషియన్ హెల్తీ ఫుడ్. అంతే కాదు పనీర్ సాఫ్ట్ గా టేస్టీ గా ఉంటుంది. పనీర్ తో తయారుచేసే వంటలు చాలా రుచికరంగా, నోరూరిస్తుంటాయి.

పనీర్ తో సాండ్విచ్ లు, గ్రేవీలు, కర్రీలు మాత్రమే కాదు, టేస్టీ బిర్యానీ కూడా తయారుచేసుకోవచ్చు. పనీర్ అంటే ఇష్టపడే వారు కోసం ఇది ఒక వెరైటీ ఫుడ్. ఈ పనీర్ బిర్యానీ రిసిపి తయారుచేయడానికి కాటేజ్ చీజ్ మరియు కొన్ని ఇండియన్ మసాలా దినుసులు ఉంటే చాలు. టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ రెడీ అయినట్లై. ఈ పనీర్ బిర్యానీ తయారుచేయడానికి ముందు పన్నీర్ ను మీకు నచ్చిన ఆకారంలో అన్ని ఒకే సైజ్ లో కట్ చేసి ఉంచుకోవాలి . ఈ స్పైసీ బిర్యానీ రిసిపిని వేడివేడిగా, మీకు నచ్చిన రైతాతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి మీరుకూడా టేస్ట్ చూడాలంటే ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Paneer Biryani Recipe

కావల్సిన పదార్థాలు:
పనీర్: 300 grms
రైస్: 500grms
బఠానీలు: 1 cup(ఉడికించినవి)
అల్లం & వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పెరుగు: 2 cups
పచ్చిమిరపకాయలు: 4 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: ¼ tps
కారం tsp: ½tps
గరం మసాలా పౌడర్: 1tps
ఏలకుల పొడి: 2 tsp
బిర్యాని ఆకు: 1
బ్లాక్ ఏలకులు: 1
లవంగాలు: 2
పెప్పర్ కార్న్(మిరియాలు): 3
నిమ్మకాయ: 1 (రసం తీసి పెట్టుకోవాలి)
కుంకుమపువ్వు: ½tsp
పాలు: 2tbsp
కొత్తిమిర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పుదీనా ఆకులు: కొద్దిగా(తరిగినవి)
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి అన్నం వండి పెట్టుకోవాలి. (అన్నం ఉడికేటప్పుడు అందులో ఉప్పు, బిర్యానీ ఆకు, నల్ల ఏలకలు, లవంగాలు మరియు కొద్దిగా మిరియాలు వేసి )తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. మద్య మద్యలో కలిగిబెడుతూ ఉడికించుకోవాలి.
2. ఇప్పుడు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు మరియు నిమ్మరసంను ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
3. అదే బౌల్లో పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత మరో బౌల్లో పాలు పోసి అందులో కొద్ది కుంకుమ పువ్వు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
5. అన్ని సిద్దం చేసి పెట్టుకొన్నాక, స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నెయ్యివ ేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ, కొన్ని నిముషాల ఫ్రై చేసిన తర్వాత అందులో పనీర్ ముక్కలను వేయాలి.
6. మొత్తం పోపు బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
7. ఇప్పుడు ఇక వెడల్పాటి పాన్ తీసుకొని అందులో ముందుగా వండి పెట్టుకొన్న రైస్ ఒక లేయర్ గా వేసి పాన్ మొత్తం సర్ధాలి. తర్వాత రైస్ లేయర్ మీద పనీర్ ను కూడా వేసి, రైస్ మొత్త కవర్ అయ్యేలా సర్దాలి. ఇప్పుడు దీని మీద ముందుగా ఉడికించి పెట్టుకొన్న పచ్చిబఠానీలు, గరం మసాలా పౌడర్, యాలకలపొడి, కుంకుమపువ్వు, పాలు, కొత్తిమీర, పుదీనా మరియు నెయ్యి వేయాలి.
8. ఇలా మొత్తం అన్నం మరియు పన్నీర్ గ్రేవీ లేయర్స్ గా సర్దుకుంటూ పూర్తి చేసుకొన్న తరవ్ాత మూత పెట్టి మరో 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే పనీర్ బిర్యానీ రిసిపి రెడీ.

English summary

Spicy Paneer Biryani Recipe

This afternoon Boldsky introduces you to a dish so yummy which will make you drool by just the sound of it - paneer biryani. If you are a vegetarian and in the mood to make a spicy dish today then this is surely a treat for your tummy. To prepare this paneer rice recipe you will need cottage cheese and other Indian spices too.
Story first published: Wednesday, March 18, 2015, 13:23 [IST]
Desktop Bottom Promotion