Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
స్పైసీ రెడ్ చట్నీ రిసిపి: మమూస్ కాంబినేష్
ఈ స్పెషల్ రెడ్ చట్నీ తయారుచేసుకొనే ప్రదేశం నేపాల్ మరియు టిబెట్ . ఈ స్పెషల్ చట్నీమన ఇండియాలో హిల్ స్టేషన్స్ లో కూడా చాలా ఫేమస్ . ఇది మమూస్ కుచక్కటి కాంబినేషన్ . ఎర్రగా నోరూరిస్తు ఉండే ఈ రెడ్ చట్నీలో క్యాలరీలు తక్కువ. అంతే కాదుస్పైసీగా టేస్ట్ గా ఉంటుంది. స్టీమింగ్ మీద తయారుచేసే ఏవంటలకైనా సరే ఇది ఫర్ఫెక్ట్ గా ఉంటుంది.
అంతే కాదుమసాలా దోసె, ఇడ్లీ వంటి వాటికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ హాట్ అండ్ స్పైసీ రెడ్ చట్నీ ఎలా తయారుచేసుకోవచ్చు చూద్దాం...


కావల్సిన పదార్థాలు:
ఎండు మిర్చి: 20-25
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ : 1tbsp
వెల్లుల్లి రెబ్బలు: 8-20
అల్లంపేస్ట్: 1/2tsp
టమోటో: 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం:1tbsp
ఆలివ్ ఆయిల్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర :కొద్దిగా


తయారుచేయు విధానం:
1. ముందుగా ఎండు మిర్చిని వేడినీళ్ళలో వేసి మొత్తగా అయినతర్వాత వాటిని తీసిన పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకొన్న ఎండుమిర్చి, మరియు ఇతర పదార్థాలన్నీ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . మీకు తినే కారంను బట్టి, ఎండు మిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
3. ఇప్పుడు ఈ చట్నీని పోపు దినుసులతో పోపు పెట్టుకొని మమూస్ లేదా ఇడ్లీ , ఛాట్ వంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ గా తినవచ్చు. అంతే స్పైసీ రెడ్ చట్నీ రెడీ...




Click it and Unblock the Notifications











