For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ టేస్టీ క్యారెట్ పికెల్ రిసిపి

|

సాధారణంగా ఆంధ్రా భోజనంలో పచ్చళ్ళ లేకుండా భోజనం పూర్తి కాదు. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ దేనికైనా పికెల్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఇది అనాది కాలం నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆఛారం అని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్ళిళ్లలో, శుభకార్యాలలో భోజనం వడ్డించే ఆకులో మొదట క్యారెట్ పికెల్ పడేది . అంతే కాదు, నోటికి కాస్త కారంగా, పుల్లగా రుచిని అందించేవి కూడా పికెల్సే...

పికెల్స్ వివిధ రకాలుగా వండుతుంటారు. ఇవి రెడ్ కలర్లో నోరూరిస్తుంటాయి. అలాంటి పచ్చళ్లలో క్యారెట్ పికెల్ ఒకటి . సాంబార్, రసం వంటి వాటికి చక్కటి, సైడ్ డిష్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. అంతే కాదు, రైస్, చపాతీ, పెరుగు అన్నకు కూడా మంచి కాంబినేషన్. మరి ఇన్నింటి టేస్టీ కాంబినేషన్ గా ఉండే క్యారెట్ పికెల్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకోకుంటే ఎలా...

Spicy Tasty Carrot Pickle Recipe

కావల్సిన పదార్థాలు:
క్యారెట్స్ - 5 to 6
ఎండుమిర్చి - 6 (for spiciness)
డ్రై రెడ్ చిల్లీస్ - 2 (To add the colour)
నిమ్మరసం - 2 teaspoons
కారం - 2 tablespoons
ఆవాలు - 1/4th teaspoon
నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. క్యారెట్స్ ను వర్టికల్ గా మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత దానికి రెండు స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. చిన్న పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, మరియు రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక రెండు నిముషాలు వేగించుకొని, క్యారెట్ ఉన్న బౌల్లోనికి మార్చుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నార్మల్ రెడ్ చిల్లీలను 5-6వేయాలి. మరియు డ్రై రెడ్ చిల్లీస్ ను వేయాలి. పౌడర్ చేసుకోవాలి.
4. అంతలోపు కొద్దిగా నీటిని బాయిల్ చేసుకోవాలి.
5. బాయిల్ చేసిన నీటిని కొద్దిగా జార్లో వేసి, ఉప్పు వేసి చిల్లీ పేస్ట్ ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6. ఈ చిల్లీ పేస్ట్ ను క్యారెట్ బౌల్లోకి మార్చుకోవాలి . మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. అంతే స్పైసీ క్యారెట్ పికెల్ రెడీ. ఇది రైస్, చపాతీలకు చాలా బాగుంటుంది.

English summary

Spicy Tasty Carrot Pickle Recipe

Some people are so addicted to that one dish in their meal and that's nothing but 'Pickle.' Lunch or dinner can never be complete without having a pickle alongside on our plate, right? Yes, pickles are the best things to have during a meal to improve the taste quotient of that dish.
Story first published: Saturday, February 20, 2016, 13:30 [IST]
Desktop Bottom Promotion