For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ టమోటో గార్లిక్ చట్నీ రిసిపి..

By Lekhaka
|

పకోడీలు లేదా ఫ్రైస్ అవీ స్నాక్స్ లాగ చేసినప్పుడు నంచుకోవడానికి మంచి డిప్స్ ఉంటే బాగుండనిపిస్తుంది కదా. సాధారణంగా ఫ్రైస్ చేసినప్పుడు వాటిని సాస్ లేదా మాయోనీజ్ తో కలిపి అతిధులకి వడ్డిస్తాము కదా. ఒకవేళ వాటినే మంచి రుచికరమైన చట్నీతో వడ్డిస్తే?? తప్పకుండా ఆ కాంబినేషన్ రుచికరంగా ఉంటుంది.సమోసాలని టమాటా సాస్‌తో వడ్డించే బదులు కొత్తిమీర లేదా పుదీనా పచ్చడితో కలిపి వడ్డిస్తే మీరు పడ్డ శ్రమకి అభినందనలు అందుకోవడం ఖాయం.

టమాటా వెల్లుల్లి పచ్చడి ఫ్రైస్ లేదా పకోడీలు ఇలా ఏ స్నాక్‌లోకైనా నంచుకోవడానికి బాగుంటుంది.ఈ చట్నీ ఎంత రుచికరంగా ఉంటుందంటే తినడం పూర్తయ్యాకా మీరు మీ వేళ్ళకున్న పచ్చడిని కూడా నాకేంతగా అన్నమాట.రుచికరమైన ఈ చట్నీ తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం చూద్దామా.

ఎంతమందికి సరిపోతుంది-4

ప్రిపరేషన్ టైం-10 నిమిషాలు

వండటానికి-15 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

  • సన్నగా తరిగిన టమాటాలు-ఒక కప్పు
  • సన్నగా తరిగిన వెల్లుల్లి-ఒక టేబుల్ స్పూను
  • నూనె-ఒక టేబుల్ స్పూను
  • ఉల్లి కాడల తరుగు(తెల్ల భాగం)-పావు కప్పు

  • Spicy Tomato Garlic Chutney Recipe

  • ముందర నీళ్ళల్లో నానబెట్టుకుని సన్నగా తరిగిన కాశ్మీరీ మిరప పళ్ళు-2
  • టమాటా కెచప్-ఒక టేబుల్ స్పూను
  • ఉల్లి కాడల తరుగు(ఆకు పచ్చని భాగం)- ఒక టేబుల్ స్పూను
  • సన్నగా తరిగిన కొత్తిమీర-ఒక టేబుల్ స్పూను
  • ఉప్పు-రుచికి తగినంత

తయారీ విధానం:

1. ముందుగా ఒక మూకుడులో నూనె వేడి చేసి ఉల్లికాడల తెల్ల భాగం వేసి వేయించాలి.

2.దీనికి వెల్లుల్లి తరుగు వేసి బాగ కలపాలి. ఎక్కువగా వేయించకూడదు సుమా. లేదంటే చట్నీ చేదెక్కే ప్రమాదం ఉంది.

స్పైసీ టమోటో గార్లిక్ చట్నీ రిసిపి..

3.ఇప్పుడు నానబెట్టి సన్నగా తరిగిన కాశ్మీరీ మిర్చి వేసి కాస్త వేగాకా టమాటా తరుగు కూడా కలిపి బాగా వేగనివ్వాలి.

4.ఒకవేళ ఈ మిశ్రమం బాగా గట్టిగా ఉంటే టమాటాలు ఉడకడానికి కాసిని నీళ్ళు చల్లి స్టవ్ మంట పెద్దగా పెట్టి కాసేపు ఉడకనివ్వండి.

స్పైసీ టమోటో గార్లిక్ చట్నీ రిసిపి..

5.టమాటాలు ఉడికేటప్పుడు గరిటెతో చిదమడం మర్చిపోవద్దు.ఇప్పుడు ఈ టమాటా మిశ్రమానికి టమాటా కెచప్ కలపాలి. టమాటా కెచప్ చట్నీకి కాస్త తీపి-పులుపు రుచిని తీసుకొస్తుంది.

6.ఇప్పుడు అన్నింటినీ మరొక్కసారి బాగా కలిపి స్టవ్ ఆపాలి.

స్పైసీ టమోటో గార్లిక్ చట్నీ రిసిపి..

7,చట్నీ పూర్తిగా చల్లారాకా ఉల్లికాడల ఆకుపచ్చని భాగం, కొత్తిమీర వేసి గార్నిష్ చెయ్యడమే.

అంతే, టమాటా వెల్లుల్లి చట్నీ తయారయిపోయింది. దీనిని సమూసాలు, పకోడీలకి జతగా మీ అతిధులకి వడ్డించండి

English summary

Spicy Tomato Garlic Chutney Recipe

One of the best chutney recipes is the tomato garlic chutney. Read to know how to prepare this delicious tomato garlic chutney
Desktop Bottom Promotion