For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పినాచ్ కర్డ్ టిక్కా రుచికరమైన ఈవెనింగ్ స్నాక్...

|

Spinach Curd Tikki
మే వెళ్ళి జూన్ వచ్చేసింది. కొద్దికొద్దిగా ఎండలు తగ్గుముఖం పట్టి వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇలాంటప్పుడే వేడి వేడిగా ఏవైనా చేసుకొని తింటే బాగుండుననిపిస్తుంది. అయితే రోజూ చేసుకునేవే అయినా వెరైటీగా చేసుకుంటే అదో మజా. ఆవిధంగా చేసుకునేవి..చేసుకోగలిగిన వాటిలో స్పినాచ్ కర్డ్ టిక్కాస్ ఒకటి...అత్యంత సులభంగా, త్వరగా అయిపోయే స్నాక్స్ అంటే స్పినాచ్ కర్డ్ టిక్కా. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇందులో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. కాని చాలామంది ఆకుకూరలంటే ఇష్టపడరు. పిల్లలు కూడా. ఇలా టిక్కాలా తయారు చేస్తే మంచి రంగు వస్తుంది. రుచి కూడా బావుంటుంది. మరి ఇన్ని పోషకాలనందించే స్పినాచ్ కర్డ్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దామా...

కావలసిన పదార్థాలు:
పాలకూర ప్యూరీ: 300
పచ్చిమిర్చి: 6-8
గడ్డపెరుగు: 2
శనగపిండి: 1
దానిమ్మగింజల పౌడర్: 1/2
నూనె: వేగించడానికి సరిపడ
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర తురుము: 1/2cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
గరం మసాలా: 1tsp
యాలకలు పొడి : 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మరుగుతున్న నీళ్లలో శుభ్రం చేసుకున్న పాలకూర ఆకులు వేసి రెండు నిమిషాల తరవాత తీసి చల్లారాక మిక్సీలో మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్నే ప్యూరీ అంటారు.
2. ఇప్పుడు పాలకూర ప్యూరీ, పెరుగు, ఉప్పు, దానిమ్మ గింజల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, యాలకుల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి అన్నింటిని ఒక బౌల్ లోనికి తీసుకొని, కొద్దిగా నీళ్ళు చేర్చి గట్టిగా గారెల పిండిలాగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ పాలకూర ప్యూరీని సమానమైన ముద్దలుగా చేసుకొని అరచేతితో వడ మాదిరిగా తయారు చేసుకోవాలి(ఒత్తుకోవాలి).
4. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొన్న తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో ముందుగా ఒత్తిపెట్టుకొన్న పూరీ వడలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే స్పానిచ్ కర్ట్ టిక్కా రెడీ. వీటిని టమోటాసాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

English summary

Spinach Curd Tikki | నోరూరించే స్పినాచ్ కర్డ్ టిక్కా...

Surely knew the benefits of this wonder green veggie. It is a rich source of vitamins A,B,C and also minerals like magnesium, iron, potassium. It is beneficial against high BP, anaemia, osteoporosis. However, it can lose its benefits if overcooked. This tikki is simple to prepare yet so delicious even without any accompaniment..The cardamom lends a unique flavour. Serve as a starter or evening snack.
Story first published:Wednesday, June 6, 2012, 17:08 [IST]
Desktop Bottom Promotion