For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెండకాయ గుత్తి కూర: రైస్ కు బెస్ట్ కాంబినేషన్

|

సహజంగా వెజిటేబుల్స్ తో వివిధ రకాల వెరైటీ వంటలను తయారు చేస్తుంటారు. అయితే వంకాయ్ టమాట.. పాలక్ దాల్.. బీరకాయ పెసరపప్పు.. ఇట్లా ఎప్పుడూ ఒకే టైప్ కాంబినేషన్స్ తినడానికే కాదు.. వండడానికి కూడా బోర్! మరందుకే వండడానికే కాదు, తినడానికీ కొత్త కాంబినేషన్స్‌తో బెండకాయ గుత్తి కూర తయారు చేయవచ్చు.

బెండకాయతో వివిధ రకాల వంటలు తయారు చేస్తుంటారు. ఈ రిసిపిలు సౌత్ ఇండియాలో ఎక్కువగా వండుతుంటారు. ఈ బెండకాయ ఫ్రై ను రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బెండీ గుత్తికూర తయారుచేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రుచి మరియు మంచి ఫ్లేవర్ తో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇండియన్ మసలా దినుసులు వేయడం వల్ల మంచి రుతితో పాటు, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నం, మరియు చపాతీలకు మంచి కాంబినేషన్.

Stuffed Bhindi Recipe

కావలసిన పదార్థాలు:
బెండకాయలు: 1/2kg
నూనె: తగినంత
స్టఫింగ్ కోసం:
సెనగలు: 1cup(ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి)
పల్లీలు: 2tbsp(వేయించాలి)
నువ్వులు: 1tbsp(వేయించాలి)
అవిసె గింజలు: 1tbsp(వేయించాలి)
పచ్చి మిర్చి ముద్ద: 2tbsp
అల్లం వెల్లుల్లి ముద్ద: 2tbsp
పసుపు: 1/4tsp
నిమ్మరసం: 2tbsp
కొత్తిమీర: గుప్పెడు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా సిద్దం చేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి.
3. బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి)
4. ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి.
5. తర్వాత వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి.
6. స్టఫ్ బెండకాయ 10నిముషాలు ఉడికిన తర్వాత పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. అంతే స్టఫ్డ్ బెండీ రెడీ. ఇది వేడి రైస్, చపాతీలకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

Story first published: Tuesday, August 19, 2014, 12:16 [IST]
Desktop Bottom Promotion