For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాంగీ బేండి విత్ బేసిన్ రిసిపి

|

బెండీ లేదా లేడీస్ ఫింగర్ ఇది ఒక వెర్సిటైల్ వెజిటేబుల్. బెండకాయను వివిధ రకాల పదార్థాలు ఉపయోగించి తయారుచేయవచ్చు.

బెండకాయలను డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారుచేయాలో ఈ క్రింది రిసిపిని చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రిసిపి . ఈ వంట రోటి, రైస్ కు అద్భుతమైనటువంటి కాంబినేషన్

ఈ సైడ్ డిష్ రిసిపి మరింత రుచిగా ఉండటం కోసం శెనగపిండిని జోడిస్తాము. మరియు కొంచెం స్టఫింగ్ మసాలాను ఉపయోగిస్తాము. మరి మీరు కూడా బేషన్ బేండి మసాలా టేస్ట్ చూడాలంటే, తయారుచేసే విధానం తెలుసుకోవాల్సిందే...

Tangy Bhindi With Besan Recipe

కావల్సిన పదార్థాలు:
బెండకాయలు: 500gms
ఉల్లిపాయ: 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
శనగ పిండి: 2tbsp
కారం: 1tsp
ఆమ్చూ పొడి: 1tsp
జీలకర్ర ½ tsp
ధనియాల పొడి : ½tsp
పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tsp

తయారుచేయు విధానం :
1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తర్వాత వాటిని పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక్కో బెండకాలయను రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించాలి.
4. తర్వాత అందులో బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి, మీడియం మంట మీద 10 నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత అందులో శెనగపిండి, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు మరయిు ఎండు మామిడిపొడిని వేసి వేయించుకోవాలి.
6. తర్వాత 5నిముషాలు వేయించుకొన్న తర్వాత, శెనగపిండి మొత్తం బెండకాయలకు పూర్తిగా అంటుకుంటుంది, శెనగపిండి బ్రౌన్ కలర్ కు మారుతుంది .
7. బెండకాయలు మెత్తగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ట్యాంగీ బేండి విత్ బేసన్ రిసిపి. అంతే బేండీ బేసిన్ రిసిపి సైడ్ డిష్ గా లేదా రోటీ, రైస్ తో మంచి కాంబినేషన్.

Story first published: Wednesday, January 29, 2014, 12:23 [IST]
Desktop Bottom Promotion