For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగాళదుంప-పచ్చిబఠానీ పులావ్

|

పీస్(పచ్చిబఠానీలు)-పొటాటో(బంగాళదుంప)ల పులావ్ ఇండియాలో చాలా పాపులర్ రిసిపి. దీన్ని నార్త్ ఇండియన్స్ మట్టర్ పీస్ కా పులావ్ అని కూడా పిలుస్తారు . ఎటువంటి సందేహం లేకుండా ఇది ఒక టేస్టీ డిష్ అంతే కాదు హెల్తీ కకూడా . ఆలూ మట్టర్ పులావ్ కు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు జోడించడం వల్ల ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది.

ఆలూ మట్టర్ కా పులావ్ ను తయారుచేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మీకు ఏదైన ఒక మంచి వంట చేయాలనుకొన్నప్పుడు ఇటువంటి సింపుల్ వంటకాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆలూ మట్టర్ కా పులావ్ రిసిపి పంజాబీయలు ఎక్కువగా వడుతుంటారు. ఈ టేస్టీ ఫుడ్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ ఆలూ మట్టర్ కా పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Tasty Aloo Matar Ka Pulao

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2 cups
బంగాళదుంపలు: 2 (ఉడికించి ముక్కలు చేసి పెట్టుకోవాలి)
పచ్చిబఠానీలు: ½ cup(ఉడికించినవి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర : 1tbsp
యాలకలు: 2-4
లవంగాలు:- 2-3
దాల్చిన చెక్క : కొద్దిగా
పెప్పర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రంగా కడిగి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి .
2. ఇప్పుడు, పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు, పచ్చిబఠానీలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో బియ్యం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి 2 కప్పులు నీళ్ళు పోయాలి.
5. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మీడియం మంట మీద 15నిముషాలు ఉడికించుకోవాలి.
అంతే ఆలూ మట్టర్ కా పులావ్ రెడీ. దీన్ని వేడి వేడిగా రైతా లేదా ఊరగాయతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Tasty Aloo Matar Ka Pulao

Peas and potato pulao recipe is popular in India. It is also called aloo matar ka pulao in north India. Undoubtedly, it is a tasty dish, and is healthy too. Aloo matar ka pulao is aromatic because you add spices to this dish.
Story first published: Thursday, November 20, 2014, 12:51 [IST]
Desktop Bottom Promotion