For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్ట్ అండ్ హెల్తీ చిక్ పీస్ బిర్యానీ రిసిపి

|

మన ఇండియాలో వంటలకు చిరుదాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అటువంటి ధాన్యాలలో చిక్ పీస్(శెనగలు)కూడా ఒకటి. ముఖ్యంగా నార్త్ సైడ్ ఎక్కువగా వీటి వాడకం ఉంటుంది. అలాగే సౌత్ లో కూడా చాలా సాధారణంగా వీటిని ఉపయోగిస్తుంటారు.

ఈ రుచికరమైన చిక్ పీస్ వంటలంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం. పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ రుచికరమైన చిక్ పీస్ తో తయారుచేసే బిర్యానీ రిసిపిని మీరు కూడా టేస్ట్ చూడాలంటే, ఒక సారి ట్రై చేయండి...

Tasty Chickpeas Biryani Recipe

కావల్సిన పదార్థాలు
చిక్పీస్(శెనగలు)- 2 cups(ఉడికించినవి)
బాస్మతి రైస్ - 2 cups
కొబ్బరి పాలు - 2 cups
నీరు - 11/2 cup
ఉల్లిపాయ - 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం - 1 tsp
గరం మసాలా - 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
అల్లం & వెల్లుల్లి పేస్ట్ - 1tsp
నెయ్యి - 2 tbsp
నూనె - 1tbsp
మసాలాలు: బే ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, స్టార్ ఆనీస్

మసాలా కోసం :
కొత్తిమీర: కొద్దిగా
పుదీనా ఆకులు కత్తిరించి - 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి - 2 -3
కొబ్బరి : 4(తురిమి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి : 2- 3
లవంగాలు : 4-5

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.
2. నెయ్యి వేడి అయ్యక, అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, స్టార్ ఆనీస్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. అంతలోపు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, కొబ్బరి తురుము మరియు పచ్చిమిర్చి వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగానే, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి 3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు కారం, గరం మసాలా, ఉప్పు మరియు నీళ్ళలో నానబెట్టిన శెనగలు(చిక్ పీస్)వేసి బాగా మిక్స్ చేసి 3నిముషాలు ఉడకనివ్వాలి.
6. తర్వాత అందులో శుభ్రం చేసుకొన్న బియ్యం, రెండు గ్లాసుల నీళ్ళు, కొబ్బరి పాలు, రెండు కప్పుల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
7. మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

English summary

Tasty Chickpeas Biryani Recipe

Chickpeas biryani is simple to prepare and is not at all time consuming. The best thing about this biryani recipe is that, you can easily convert it to a non-vegetarian meal by adding diced chicken. However, it tastes best only with the chickpeas.
Story first published: Wednesday, May 20, 2015, 14:19 [IST]
Desktop Bottom Promotion