For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్ రూట్ అండ్ పీస్ పులావ్ రిసిపి : హెల్తీ & టేస్టీ

|

బీట్ రూట్ ఇది ఒక దుంప కూరగాయ. బీట్ రూట్ తో వివిధ రాకాల వంటలు వండుతారు. ముఖ్యంగా బీట్ రూట్ తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ కర్రీ, వేపుడు వంటివి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రంగు రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో అత్యధిక పోషవిలువలు ఉన్నాయి.

ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధవున్నవారు రెండు బీట్ రూట్ తినడానికి ఇష్టపడుతారు. అయితే బీట్ రూట్ తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి బీట్ రూట్ ను, జ్యూసులు, సలాడ్, వేపుడు రూపంలోనే కాకుండా బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు. పూరీలు మొదలు వడలు వరకూ వివిధ రకాల వంటలు తయారు చేసుకొని తినవచ్చు. మరి బీట్ రూట్ తో కాస్త వెరైటీగా పచ్చిబఠానీలు చేర్చి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Tasty And Healthy Beetroot Pulao Recipe


కావల్సిన పదార్థాలు:
బీట్ రూట్ - 1 cup (chopped)
పీస్(పచ్చిబఠానీలు: 1cup
రైస్ - 2 cups
పచ్చిమిర్చి - 4 to 5
గరం మసాలా - 1 teaspoon
ధనియాలపొడి - 1 teaspoon
బిర్యానీ ఆకు - 2
ఉల్లిపాయలు - 1 cup
జీలకర్ర - 1/4th teaspoon
యాలకలు - 3 to 4
పెప్పర్ - 1/4th teaspoon
జీడిపప్పు - 8 to 10
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, మరియు పచ్చిమిర్చి వేయాలి.
2. తర్వాత గరం మసాలా, కొత్తిమీర పౌడర్, యాలకలు, పెప్పర్ మరియు జీడిపప్పు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన బీట్ రూట్, పచ్చిబఠానీలు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసి మూత వేయాలి . తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. అంతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని రైతాతో సర్వ్ చేయాలి. అంతే వేడివేడి బీట్ రూట్ పీస్ పులావ్ రెడీ.

English summary

Tasty And Healthy Beetroot Pulao Recipe

Basically, eating beetroot is very important. There are several recipes that you can prepare with beetroot, the most famous are the beetroot sambar and gravy.
Story first published: Friday, March 4, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion