For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మతిమరుపును దూరం చేసే పాలకూర పప్పు

|

Toor Dal - Palak Pappu
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. మీరు తీసుకునే ఆహారంలో రెండు రోజులకోసారి ఆకు కూరలుండేలా చూసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇందులో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇందులో పదమూడు రకాల యాంటీఆక్సిడెంట్‌లున్నాయి. అయితే మిగిలిన ఆకుకూరలతో పోలి స్తే... పాలకూర అనేక పోషకాలను అంది స్తుందని.. దానివల్ల మనిషికి వయసుతో పాటు వచ్చే మతిమరుపు వ్యాధిని దూరం చేస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇవి యాంటీ క్యాన్సర్‌ ఏజంట్లుగా పనిచేస్తాయి. కాల్షియం ఎముకలు దృఢంగా తయారవడానికి తోడ్పడుతుంది.విటమిన్‌ సీ, ఏ, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్‌లు క్యాన్సర్‌ను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

కావలసిన పదార్ధాలు :

కందిపప్పు : 1cup
పాల కూర : చిన్నవి ఐతే రెండు కట్టలు
చుక్క కూర : ఒక కట్ట
పచ్చి మిర్చి : 6-8
ఉల్లిపాయ : 1
టమోటా : 2
పసుపు : 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
పోపు కోసం:
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఎండుమిర్చి : రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
జీల కర్ర : 1tsp
ఆవాలు : 1tsp
ఇంగువ : చిటికెడు
నెయ్యి : 2tsp

తయారు చేయు విధానం :
1. ముందుగా ఆకుకూరలు రెండూ బాగా కడిగి సన్నగా ముక్కలు కోసుకోవాలి.
2. తర్వాత పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఆకుకూర పప్పు లో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి.
3. తరువాత పొయ్యి వెలిగించుకొని చిన్న బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి .
4. చివరగా ఇంగువ కూడా వేసి వేగనిచ్చి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. అంతే ఆరోగ్యం తోపాటు మంచి రుచిగా ఉండే పాకుకూర పప్పు రెడీ.

English summary

Toor Dal - Palak Pappu | ఆరోగ్య ప్రదాయిని పాలకూర పప్పు

Palakura pappu is a delicious heartening dal using spinach greens – a classic Andhra pappu kura. Its full of protein, nutritious and you will enjoy preparing it because its easy, quick and your kitchen will be filled with an aromatic fresh flavor of spinach simmering with tuvar dal that absorbs the seasoning beautifully.
 Try palak pappu recipe in the Andhra way and enjoy the spicy dal with rice or roti.
Story first published:Wednesday, August 22, 2012, 9:52 [IST]
Desktop Bottom Promotion