For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ కటి రోల్-హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

బ్రేక్ ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ చాలా హెల్తీగా తినాలనుకుంటాం. అయితే ప్రతి డిన్నర్ లో , బ్రేక్ ఫాస్ట్ లో చేసినవే చేసి, తిన్నవే మళ్ళీ మళ్ళీ తినాలంటే చాలా బోర్ కొడుతుంది. ప్రతి రోజూ సూపులు, సలాడ్స్, వ్రాప్ లేదా సాండ్ విచ్ ఇలా. ...
కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను వెజిటేబుల్స్ తోటి తయారు చేసుకొని తింటే రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు..పెద్దలు అందరూ కలిసి తిని ఎంజాయ్ చేసే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ వెజిటేబుల్ కటీ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

Vegetable Kati Roll-Healthy Breakfast

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
మైదా : 1/2cup
ఉప్పు: 1/2tsp
పిండికలుపుకోవడానికి సరిపడా నీళ్ళు
ఫిల్లింగ్ కోసం:
మిక్స్డ్ వెజిటేబుల్ : 2cups(బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ మరియు క్యాబేజ్)
అల్లం పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
పసుపు పొడి: చిటికెడు
చాట్ మాసాలా పౌడర్: 1tsp
కిచెన్ కింగ్ మసాలా: 1tsp(అవసరం అయితేనే)
గుడ్లు: 2
నిమ్మరసం: 1tbsp
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
గ్రీన్ చట్నీ: 2-3tbsp
ఆలివ్ ఆయిల్ : 2-3tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేయు విధానం :
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, మైదా, గోధుమపిండి రెండూ వేసి బాగా మిక్స్ చేయలి. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి చపాతీ పిండిలా సున్నితంగా కలుపుకోవాలి. కలుపుకొన్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాత్రలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొన్ని సెకన్లు వేగించాలి. తర్వాత క్యారెట్ మరియు క్యాబేజ మరియు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు కూడావేసి వేగించుకోవాలి. అందులో పసుపు, కిచెన్ కింగ్ మసాలా, చాట్ మసాలా వేసి బాగా వేగించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు క్రిందికి దించుకొన్న తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు చేర్చి బాగా కలగలిపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలకు గ్రీన్ చట్నీ మిక్స్ చేసి బాగా కలగలిపి పక్కన పెట్టుకోవాలి .
5. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి కోడిగుడ్లు పగులగొట్టి వేసి అందులో ఉప్పు మరియు పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి .
6. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న చపాతీ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని ఉండలు చేసి, ఫిల్లింగ్ వెజిటేబుల్ మసాలా పట్టేంత సైజులో రోటీలను వత్తుకోవాలి.
7. ఇప్పుడు పాన్ /తవా వేడి చేసి రోటీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి . ఇలా అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని రోటీస్ సిద్ధం మరియు మృదువుగా ఉంచడానికి ఒక క్యాస్రోల్ ఉంచండి.
8. ఇక సర్వ్ చేయడానికి ముందు తవా వేడి చేసి దాని మీద కొద్దిగా ఆయిల్ ను చిలకర్రించాలి. తర్వాత లైట్ గాకాల్చిపెట్టుకొన్న రోటీని తవా మీద వేసి ఒక్క వైపు మాత్రం కాల్చుకోవాలి. ఇప్పుడు కాలుతున్న చపాతీ మీద కొద్దిగా గుడ్డు మిశ్రమాన్ని వేసి రోటీ మొత్తం స్పూన్ తో సర్ధాలి.
9. తర్వాత ఈ తవా మీద నుండి రోటీని పైకి మడవాలి. ఎగ్ ఉన్న రోటీ వైపు నిమ్మరసం చిలకరించాలి. ఇప్పుడు రోటీ మద్యలో వెజిటేబుల్ మసాలా కావల్సినంత నింపుకొని దాని మీద ఉల్లిపాయలగ్రీన్ చట్నీ మిశ్రమాన్ని వేసి రోల్ చేయాలి. అంతే వెజిటేబుల్ రోటీ రోల్ రెడీ వేడి వేడిగా సర్వ్ చేసి తింటూ ఎంజాయ్ చేయండి...

English summary

Vegetable Kati Roll-Healthy Breakfast | వెజిటేబుల్ కటి రోల్-హెల్తీ బ్రేక్ ఫాస్ట్

Vegetable kathi roll is chapathi roll filled with spicy vegetable filling and green chutney. Kathi rolls are great for lunch boxes or picnics. They are perfect for on the go snacks/breakfast for kids.
Story first published: Tuesday, April 23, 2013, 9:55 [IST]
Desktop Bottom Promotion