For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ స్పెషల్ సాగ్ పన్నీర్ రిసిపి

|

సాగ్ పన్నీర్ రిసిపి ఒక న్యూట్రీషియన్ డిష్. ఇలాంటి వంటను వింటర్ లో తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ఆకుకూర, పన్నీర్ కాంబినేషన్లే ఎక్కువ పోషకాలను మన శరీరానికి అందించినట్లు అవుతుంది. దాంతో చలికాలంలో ఎదురయ్యే చిన్న చిన్న జబ్బులకు ఎదుర్కోవడానికి అవసరం అయ్యే వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు.

పనీర్ మరియు పాలక్ తో పాటు క్రీమ్ ను ఉపయోగించడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ తో పాటు, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. మరి ఈ పనీర్ రిసిపిని చలికాలంలో మీకు నచ్చిన విధంగా రుచికరంగా వండుకోవడానికి తయారుచేసే పద్దతిని తెలుసుకోండి...

Saag Paneer Recipe

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250grms
పాలకూర: 1కట్ట
మస్టర్డ్ లీవ్స్: 1కట్ట
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగినవి)
టమోటో గుజ్జు: 4tbsp
వెల్లుల్లి రెబ్బలు: 8
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
గరం మసాలా పౌడర్: 1tsp
మేతి : 1tbsp
జీలకర్ర: 1tsp
ఫ్రెష్ క్రీమ్: 1/2cup
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూర మరియు మస్టర్డ్ లీవ్స్ ను శుభ్రంగా కండిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి .
2. తర్వాత అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేగనివ్వాలి.
3. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు మరియు పనీర్ క్యూబ్స్ ను ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత పనీర్ క్యూబ్స్ ను ప్లేట్ లోకి మార్చుకోవాలి.
6. ఇప్పుడు అదే పాన్ లో ఆకు కూరల తరుగు వేసి మీడియం మంట మీద 4-5నిముషాలు ఉడికించుకోవాలి.
7. కూరాకు మెత్తగా ఫ్రై అయిన తర్వాత అందులో టమోటో గుజ్జు, జీలకర్ర పొడి, కారం, ధనియాలపొడి, వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత అందులో ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
9. ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేసి మిక్స్ చేయాలి.
10. ఇప్పుడు కస్తూరి మేతిని కూడా పొడి చేసి గ్రేవీలో చిలకరించుకోవాలి.
11. తర్వాత గరం మసాలా వేసి పన్నీర్ మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
12. చివరగా ఫ్రెష్ క్రీమ్ ను టాపింగ్ గా వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే వింటర్ స్పెషల్ సాగ్ పనీర్ రిసిపి రెడీ...

Story first published: Wednesday, December 17, 2014, 15:02 [IST]
Desktop Bottom Promotion