For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన పైనాపిల్ రసం రిసిపి : సంక్రాంతి స్పెషల్

|

రసంలేదా చారు అనేది ఒక దక్షిణ భారత సూపు (ద్రవపదార్థ వంటకం). సాంప్రదాయ తయారీ విధానంతో తయారయ్యే ఈ వంటకంలో ప్రధానంగా చింతపండు రసం ఉపయోగించడంతో పాటు అదనంగా టమోటో, నిమ్మకాయ, మిరప మరియు ఇతర రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఏదేని కూరగాయలు జోడించడంతో పాటు ఉడకబెట్టిన పప్పులును కూడా కొంచెం ఈ రసానికి కలుపుతారు. ప్రస్తుత రోజుల్లో రసం తయారీకి అవసరమైన మసాలా దినుసులన్నింటినీ ఒక్కటిగా జోడించి ముందుస్తుగానే పొడిచేసి అప్పటికప్పుడు ఉపయోగించడానికి వీలుగా రసం పొడి పేరుతో అందుబాటులో ఉంచుతున్నారు. అలా కాకుండా అప్పటికప్పుడు రసం పౌడర్ ఫ్రెష్ గా తయారుచేసుకొని పైనాపిల్ రసంను తయారుచేసుకోవచ్చు.

వీటిని అన్నంతో కలిపి లేదా సూపు రూపంలో తీసుకునేందుకు వీలుగా ఉంటాయి. సంప్రదాయ భోజనంలో ఇది సాంబారు అన్నం తర్వాత స్థానాన్ని వహించడంతో పాటు దీనితర్వాత పెరుగు అన్నం తీసుకోవడం జరుగుతుంది. రసం అనేది తనకంటూ ప్రత్యేకమైన మసాల దినుసులను కలిగి ఉండడంతో పాటు పూర్తిగా పల్చటి ద్రవ రూపంలో ఉండడం వల్ల సాంబారుతో పోలిస్తే రసం అనేది ఒక విశిష్టమైన రుచిని కలిగి ఉంటుంది. రసంలో కూడా వివిధ రకాలుగా ఉంటాయి, అందులో ఒక డిఫరెంట్ టేస్టీ రసం సంక్రాంతి స్పెషల్ గా మీకోసం...

Yummy Pineapple Rasam Recipe For Pongal

కావల్సిన పదార్థాలు:
నీళ్ళు: 3 cups
కొత్తిమీర కాడలు: (ఒకటిగా చేసిన కట్టకట్టాలి)
పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: 1 (సన్నగా తురుమి పెట్టుకోవాలి)
పైనాపిల్: ½ సగం (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 1 (సన్నగా తరిగినవి)
రసం పౌడర్: 1 tsp
పసుపు: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
బెల్లం: ½ tsp
పైనాపిల్ జ్యూస్: 6 tbsp
కందిపప్పు : ½ cup (మొత్తగా ఉడికించిన నీరు)
కొబ్బరి పాలు: ½ cup
పోపుకోసం కావల్సిన పదార్థాలు:
జీలకర్ర: 1/2tsp
మిరియాలు: 1/2tsp
నెయ్యి: 1tsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 4 (dry)
ఇంగువ: 1tsp
కొత్తిమీర: 1 sprig (chopped)
కరివేపాకు: గుప్పెడు

Yummy Pineapple Rasam Recipe For Pongal
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత అందులో కొత్తిమీర కాడట కట్ట, పచ్చిమిర్చి, అల్లం, పైనాపిల్, టమోటో, రసం పౌడర్, పసుపు, ఉప్పు, బెల్లం, పైనాపిల్ జ్యూస్, ఉప్పు, కొబ్బరి పాలు, ఉడికించిన కందిపప్పు నీటితో సహా పోయాలి.
2. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి.

Yummy Pineapple Rasam Recipe For Pongal
3. 15నిముషాల తర్వాత అందులో జీలకర్ర మరియు మిరియాల పొడి వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని, అందులోకొద్దిగా నెయ్యి వేసి, కరిగి తర్వాత, అందులో కొద్దిగా ఆవాలు వేసి, చిటపటలాడిన తర్వాత, అందులో ఎండు మిర్చి, మరియు ఇంగువ వేసి చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

Yummy Pineapple Rasam Recipe For Pongal
5. ఇప్పుడు అందులోనే కొత్తిమీర వేసి వేగించుకోవాలి, తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ పోపును తీసి ఉడుకుతున్న రసంలో పోసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పైనాపిల్ రసం రెడీ
Yummy Pineapple Rasam Recipe For Pongal

English summary

Yummy Pineapple Rasam Recipe For Pongal


 If you are a foodie, make place for something sweet and sour on your plate. This afternoon Boldsky shares with you a pongal recipe you can prepare to bring in the New Year. Pineapple rasam is an easy lunch recipe which you can prepare using this sweet and sour fruit.
Story first published: Wednesday, January 14, 2015, 12:31 [IST]
Desktop Bottom Promotion