ఉదయాన్నే ఈ గంజి తాగితే రోజంతా గుర్రంలా ఉంటారు.. సులభంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?

బయట దొరికే ఆహరం ఎంత తిన్నా.. ఇంట్లో తిన్న ఆహరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఇడ్లీ, బోండా అంటూ బయట టిఫిన్ సెంటర్లకు పరిగెత్తకుండా ఇంట్లోనే ఈ వెజిటేబుల్ గంజిని తయారుచేసుకొని తాగండి. రోజంతా చురుగ్గా ఉండడంతో పాటు ఏ పనినైనా వెంటనే క్షణాల్లోనే చేసేస్తారు.

ఇంతటి శక్తి ఉన్న ఈ వెజిటేబుల్ గంజిని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది. అయితే ఈ వెజిటేబుల్ గంజి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా ఈ గంజిని తయారుచేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముందుగా వెజిటేబుల్ గంజి తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం

  1. ఒక కప్పు బియ్యం
  2. మూడు కప్పుల నీరు
  3. రుచికి సరిపడా ఉప్పు
  4. ఒక టేబుల్ స్పూన్ నూనె
  5. అర టేబుల్ స్పూన్ ఆవాలు
  6. సన్నగా తరిగిన ఒక క్యారెట్
  7. పది బీన్స్
  8. ససన్నగా తరిగిన ఒక మొక్కజొన్న కంకి
  9. మూడు తరిగిన పచ్చిమిర్చి
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
  11. ఒకటిన్నర కప్పుల నీళ్లు
  12. కొద్దిగా కొత్తిమీర

వెజిటేబుల్ గంజి తయారీ విధానం

ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని రెండుసార్లు నీటితో కడుక్కోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని తీసుకొని మిక్సీలో వేసి కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత కుక్కర్‌లో మెత్తగా రుబ్బుకున్న బియ్యం వేసుకోవాలి. అలాగే అందులో రుచికి ఉప్పు వేసుకోవాలి. దీనితో పాటు మూడు కప్పుల నీళ్లు కూడా కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.

ఈ క్రమంలోనే ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, మొక్కజొన్న ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ తరువాత పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. తరువాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి. దీంతోపాటు రుచికి సరిపడా ఉప్పు వేసి అయిదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి.

నీళ్లు అయిదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న గంజిలో ఈ వెజిటేబుల్ సూప్ వేసుకోవాలి. తరువాత ఒక్కసారిగా బాగా కలిపి కుక్కర్ మూత వేసి మరలా ఒక అయిదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసేసి కొత్తిమీర చల్లుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా వెజిటేబుల్ గంజి సిద్ధమైపోతుంది. దీనిని తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు.

గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.

[ of 5 - Users]
Story first published: Sunday, November 17, 2024, 9:04 [IST]
Desktop Bottom Promotion