For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఒక సవతి తల్లి అయితే?

By B N Sharma
|

Are you a step mum?
పిల్లలు వున్న మగ మహారాజుని ప్రేమించేశారా? పెళ్ళి చేసుకున్నారా? పిల్లల పెంపకం భాధ్యత మీపై పడిసవతి తల్లి అయిపోయారా? మరి అటువంటి సమయంలో మీరు ఆచరించాల్సిన పద్ధతులు కొన్ని చూడండి. ముందుగా మీరు అతనికి దగ్గరై పిల్లలను కూడా బాగా మచ్చిక చేసుకోవాలంటే, అతని జీవితంలో మీరు భాగమై జీవిత ప్రయాణం చేయాలంటే కొన్నిచిట్కాలు ఇస్తున్నాంపరిశీలించండి. పెళ్ళి కంటే కూడా బిడ్డల తండ్రితో పెళ్ళి ఏంతో కష్టమైన వ్యవహారం. ఇక్కడ మీ శ్రమ, పేరు ప్రఖ్యాతులు పెట్టుబడిగా పెట్టవలసి వుంటుంది. మరి అది ఫలితాలనివ్వాలంటే దీర్ఘ కాలం కూడా పడుతుంది. మీ పురుషుడి పిల్లలు మిమ్మల్ని తల్లిగా ఒప్పుకోలేరు. వారి గత అనుభవాలు, ఆనందాలు వారికి వేరుగా వుంటాయి. అవన్ని మీరు ఒక సవతి తల్లిగా పూర్తిగా అర్ధం చేసుకోలేరు. కనుక వారికి మీకు మధ్య కొంత ఎడం వుంటుంది. పిల్లలు సరిగా అలవాటు కాక విడిపోయిన జంటలు కూడా వున్నారు. పిల్లలు సవతి తల్లిని లేదా తండ్రిని ఇష్టపడరు. మొదటిలో వీరు పిల్లలతో చాలా కష్టాలు పడవలసి వుంటుంది. అయితే అన్ని విషయాలలోను అది సరికాకపోవచ్చు. కొన్ని కేసులలో పిల్లలు తమ సవతి తల్లిని స్వాగతించేవారు కూడా అయివుంటారు. సవతి తల్లిని మమ్మీ - 2 అంటూ వ్యవహరించేస్తారు. అటువంటపుడు ఇరు వర్గాల వారికి జీవితం ఆనందంగాసాగిపోతుంది. కాని ఒక కొత్త తల్లి లేదా తండ్రిగా మీరు అనేక అంశాలు చక్కపెట్టాల్సివస్తుంది.

- మీ కొత్త సంబంధాన్ని పూర్తి నిజాయతీతో మొదలు పెట్టండి. అతను మీకు అంతా తియ్యగా అప్పచెప్పేశాడని భావించకండి. గతంలోని అతని మాజీ ఎన్నో సమస్యలతో అతనికి విడాకులు ఇచ్చి వుండవచ్చు. దానికి కారణాలు తెలుసుకోండి.

- చేదు అనుభవాలు ఉంటాయి. సంభాషణ మొదటిలో కష్టమవుతుంది. పిల్లల కొరకు, అతనితో లేదా ఆమెతో మీరు బాగా వుండాలి. మీ అంతట మీరే చొరవ తీసుకొని వ్యవహరించాలి.

- ఒకసారి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మీ ఆశలను పార్టనర్ కు వివరించండి. అవి తక్కువగా వుండేలా చూడండి. ఈ మార్పు చాలా కష్టమైనదని గ్రహించండి. కాని ఒత్తిడి తెచ్చుకుంటే, ఇద్దరికి మంచిది కాదు. సహనం, ఓర్పు వంటివి ప్రదర్శించాలి.

- అన్ని అంశాలలోను సరి అయిన విధంగా చర్చలు చేయండి. పిల్లలు మీ నుండి ఏం ఆశిస్తున్నారనేది తెలుసుకోండి. ఇది కొంచెం కష్టమే. వారు మీతో స్నేహంగా వుంటూనే సమస్యలు తెస్తారు. వారి భావాల నియంత్రణలో మీరు జాగ్రత్త వహించాలి.

పిల్లల విషయంలో మీరు ఎంత అధిక శ్రద్ధ వహిస్తే అంత త్వరగా కుటుంబంలోని అంశాలు చక్కబడతాయి. అతని నుండి కూడా మీకు మంచి స్పందన వుంటుంది. మీరు కుటుంబంలో త్వరగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎటువంటి సంబంధాలైనా సరే దీర్ఘ కాలంలో ప్రేమాతి శయాలను చూపుతూ, తగిన రీతిలో భాధ్యతలను నిర్వర్తిస్తూంటే, తప్పక సర్దుబాటు అవుతాయి. కుటుంబంలో ఆనందాలు వెల్లి విరుస్తాయి. అపుడు పిల్లలు సైతం తండ్రితో పాటుగా మీరు ఆశించే ఆనందాలను మీకు అందించగలరు.

English summary

Are you a step mum? | మీరు ఒక సవతి తల్లి అయితే?

Fallen for a man with kids? Blending families can be complicated. Here's how to start your journey so that the transition is smooth for everyone Marrying a man with children is more than just getting married — it's like investing in a family; an investment that takes a lot of time to grow and flourish.
Story first published:Monday, June 4, 2012, 14:06 [IST]
Desktop Bottom Promotion