For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య భర్తల మధ్య సెల్ ఫోన్ల తంట...!

|

సెల్ ఫోన్లు మాటలను, మనుషులను కలుపుతాయని అనుకోవడం పొరపాటని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇవి మనుషుల మధ్య సంబంధాలను తెంచి పారేస్తాయని అంటున్నారు. మొబైల్ ఫోన్లను ఖాళీగా గదిలో ఓ మూలన పడవేసినా ఇతరులతో మనం జరిపే సంప్రదింపులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎసెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సెల్‌ఫోన్ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వచ్చే తేడాలను గర్తించడానికి రెండు ప్రయోగాలను వారు చేశారు. ఈ ప్రయోగాలలో సెల్ ఫోన్ వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్లు కనుగొన్నారు.

ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు, ఇద్దరు స్నేహితులు కావచ్చే, ప్రేమికులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, భార్త భర్తల మధ్య బంధాలు దూరం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగానికి, ఆత్మీయతలకు నడుమ... సెల్ ఫోన్లు వచ్చి చేరడంతోపాటు, అవి వారి సాంసారిక జీవితానికే చిచ్చుబుడ్డీలుగా మారుతున్నాయి. దాంపత్య జీవనంలో సాంకేతిక పరికరాల జోక్యం ఎక్కువ కావడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని భారతీయ గృహిణులు ఇలా చెబుతున్నారు... మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎంపీ3 ప్లేయర్లు, ఐపాడ్‌లు, వీడియో గేమ్స్ లాంటివి తమ సంసారంలో అడ్డుగోడలుగా నిలుస్తున్నాయనీ, తమపచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయని వారు వాపోతున్నారు.

Mobile Phones break-up Relationships

సాంకేతిక విప్లవంతో ఎన్నో రకాల యంత్ర పరికరాలు జీవన విధానంలో భాగమై పోవడమే కాకుండా, భారతీయ గృహిణులకు అక్రమ సంబందాలుగా తయారవుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన భర్త తనతో కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్‌తోనో, ల్యాప్‌టాప్‌తోనో గడిపేస్తున్నారని, తనకంటే ముందుగా అవి పడకగదిలోకి చేరిపోతున్నాయని చాలామంది మహిళలు ఆరోపిస్తున్నారు.

ప్రశాంతంగా, సరదాగా గడిపేందుకు అలా షికారుకెళితే... తనను పక్కన పెట్టేసి... ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారంటూ భర్తల ఘనకార్యాలను దుయ్యబట్టని మహిళలు ఈరోజుల్లో చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇక సెల్‌ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళడమే గాకుండా, తనకు వచ్చిన కాల్స్ ఎందుకు అటెండ్ చేశావనీ, తన ల్యాప్‌టాప్ ఎందుకు ఉపయోగించావని నానా యాగీ చేసే పురుష పుంగవులతో ఇంట్లో జీవితం నరకప్రాయం అవుతోందని గృహిణులు ఆవేదన చెందుతున్నారు.

ఈ మధ్యకాలంలో అనేకమంది దంపతులు సాంకేతిక పరికరాలకు సంబంధించిన సమస్యలతోనే తమవద్దకు వస్తున్నారని ప్రముఖ మానసిక వైద్యులందరూ కూడా చెబుతున్నారు. తమమధ్య అనేక విబేధాలకు, అపోహలకూ కారణమవుతున్న సెల్‌ఫోన్ల నుండి విముక్తి అనేది లేనే లేదా... తమ భర్తలు బాగుపడే మార్గమే లేదా..? అని గృహిణులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.

నేటి స్పీడ్ యుగంలో సాంకేతిక పరికరాల అవసరం, వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ... అవి దాంపత్య సంబంధాలనే విచ్చిన్నం చేసే పరిస్థితి మాత్రం ఎదురైతే సాధ్యమైనంతగా వాటి వాడకం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భర్తలు ఈ దిశగా ఆలోచించి అడుగులు వేసినట్లయితేనే... వారి సాంసారిక జీవితంలో సాఫీలేకుండా సాగిపోతుంది.

English summary

Do Mobile Phones break-up Relationships? | ఆ ‘సెల్లే’ లేకపోతే లైఫ్ హాపీ....!

Some men and women get flirtation text messages sent to themselves being it pure fun and nothing in it at all but it can still lead to problems, some men and women actually prefer texting than chatting with their partners, go to bed and they have the phone with them, go to the bathroom and yes they have it with them, basically the mobile phone is glued to them and will never leave their sides..
Desktop Bottom Promotion