For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతోషకరమైన ప్రేమికుల వారం మొదలైంది...!

|

ప్రేమికుల రోజు దగ్గరపడుతోంది. ఈ వాలెంటైన్ సెలబ్రేషన్స్ ను టీనేజర్స్, యువతి, యువకులు మాత్రమే కాదు నలభయ్యోల్లలోపడి వారికి కూడా వర్తిస్తుంది. లవర్స్ డే నాడు ఈ వయసులవారు కూడా ఇచ్చి పుచ్చుకోడాలలో ఆనందిస్తారు. మరి ప్రేయసితో మీ సమాగమం ఎలా ప్రణాళిక చేస్తున్నారు? మీ వద్ద ఏ రకమైన ప్లాను లేకుంటే, కొన్ని సులభమైన వేలంటైన్ రోజు ప్రణాళికలు ఇస్తున్నాం పరిశీలించండి. అందుకే ఫిబ్రవరి నెల రొమాన్స్ కు సంకేతం అంటారు.

ప్రేమికుల రోజును ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14న జరుపుకుంటారు . ఈ రోజు ముందు వేలంటైన్‌ వీక్ అని (ప్రేమికుల వారము) అని జరుపుకునే ఆచారము ఉన్నది . వేలంటైన్‌ వీక్ లో మొదటి రోజు గులాబీ దినోత్సవం (రోస్ డే) ని జరుపుకుంటారు. వేలంటైన్‌ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తో ప్రారంభమౌతాయి. మీకు నచ్చిన పాట్నర్ కు మీ ఇష్టాన్ని తెలపడానికి ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో బహుమానాన్నించి, వారికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారు.

ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీ వచ్చే వేలంటైన్స్ డే నాడు తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి ఏ బహుమతి ఇవ్వాలా అనేది ప్రతి ప్రేమికుడూ ప్రేయసి ఆలోచిస్తూనే వుంటుంది. ఎన్నో రకాల కొత్త ఆలోచనలు, కొత్త బహుమతులు, ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో వేడుకలు, సినిమాలు, డిన్నర్లు, వంటలు మొదలైనవాటితో ఆనందాలు ప్రేమికులకు కలుగుతాయి. అయితే ప్రేమికుల రోజుకు ముందు ఏడు రోజులు ప్రేమికుల వారాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం...

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 7 రోజ్ డే: వాలెంటైన్ వారంలో మొదటి రోజును రోజ్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటిసారిగా మీకు చాలా ఇష్టమైన వారితో కలవాలన్నా, పలకరించాలన్న ఈ రోజ్ డే రోజున ఒక మంచి గులాబీ పువ్వును ఇవ్వండి. అయితే గులాబీ పువ్వుల కలర్స్ చాలా అర్ధాలున్నాయి. ఒక్కోరంగుకు ఒక్కో అర్థం ఉంటుంది.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే: కాలేజ్ మెంట్ కు లేదా మీ కొలిగ్ కో మీకు బాగా నచ్చిన వ్యక్తికో(స్త్రీ/పు) ఓ మంచి బహుమతిని ఇచ్చి వారిని ఆశ్చర్యానికి గురిచేసి, వారి ఆనందపు కాంతులకు మీరు ఎంజాయ్ చేయవచ్చు.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 9-చాక్లెట్ డే: సాధారణంగా మహిళలు చాక్లెట్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాక్లెట్లు కామోద్దీపన పదార్ధాలుగా పని చేసి జరుగబోయే హాట్ హాట్ రాత్రికి కూల్ కూల్ గా వుంచుతాయి.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 10 టెడ్డీ డే: మీ ప్రేయసి టెడ్డీ బీర్ వంటి ముద్దుముద్దు బొమ్మలను ఇష్టపడే వారైతే ఈ ఫిబ్రవరి పదిన ఆ బహుమానంతో ఆనందపరచండి. టెడ్డీలలో కూడా వివిధ రంగులు, సైజలు మార్కెట్లో దొరుకుతాయి. అందులో మీ పాట్నర్ కు నచ్చే రంగు సెలక్ట్ చేసుకోండి.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 11 ప్రామిస్(వాగ్ఘానం) డే: మీకు నచ్చిన వ్యక్తికి దగ్గర కావడం కోసం కొన్ని వాగ్దానాలు చేయక తప్పదు. ప్రేయసి మీద మీకు ఉన్న ప్రేమని మీ వాగ్దానం ద్వారా తెలపండి. మీ పార్ట్నర్ కు మరింత దగ్గర అవ్వండి.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 12 హగ్ డే: ఇద్దరు వ్యక్తుల మద్య ప్రేమాను రాగాలను, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. ఒక చిన్న కౌగిలింతతో మనస్సు పరవశిస్తుంది. ప్రశాంతత చెందుతుంది. మరి ఫిబ్రవర్ 12 మీకు నచ్చిన వ్యక్తి ఓ చిన్ని హగ్ ఇవ్వండి.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 13 కిస్ డే: ఈ రోజున మీకు ఇష్టమైన పాట్నర్ కు, జీవితాంతం గుర్తుండుపోయే ఓ ముద్దును ఇవ్వాలనుకుంటారు. అందుకు మీ నోటిని తాజాగా ఉంచుకొనేదు మౌత్ ఫ్రెషర్ ను ఉపయోగించవచ్చు.

హ్యాపీ వాలెంటైన్ వీక్....

ఫిబ్రవరి 14-వాలెంటైన్ డే: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. మీకు ఇష్టమైన మీ పార్ట్నర్ తో మీ ప్రేమను తెలపడానికి సరైన రోజు. కాబట్టి మీ మనస్సులో ప్రేమను బయట పెట్టండి.

English summary

Happy Valentine Week | హ్యాపీ వాలెంటైన్ వీక్....

Valentines Day isn’t only about 14th Feb; it’s about an entire week comprising of various events. The days have been named accordingly. Related Articles.
Story first published: Thursday, February 7, 2013, 16:27 [IST]
Desktop Bottom Promotion