ప్రతి జంట అర్థం చేసుకోగలిగే రొమాంటిక్ పరిస్థితులు

Subscribe to Boldsky

మనుషులు పొందే సంతోషాలలో అన్నిటికన్నా పైన ఉండేది రొమాన్స్. అంతులేని ఆనందాన్నిచ్చేది ప్రేమ అనే ఒక్క భావం మాత్రమే.అందుకని ఈ వ్యాసంలో ప్రేమ మరియు రొమాన్స్ గురించి మాట్లాడుకుందాం!

పైపైన ప్రేమ,రొమాన్స్ రెండూ సాధారణంగానే అన్పించినా, ఇద్దరు మెదడు,శరీరాలలో వేలకొలది సంక్లిష్ట రసాయన చర్యల ఫలితంగా ఆ భావాలు కలుగుతాయి.ఈ చర్యల ఫలితాలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి

Things Couples Can Relate To

రొమాన్స్ యొక్క లక్ష్యం కేవలం ప్రేమతో చేసే సెక్స్ మాత్రమే కాదు. నిజానికి జంటల రొమాంటిక్ సంఘటనలు కేవలం పడకగదిలోనే జరగవు. నిజజీవితంలో రొమాంటిక్ పరిస్థితులు చాలా విచిత్రంగా జరుగుతాయి. చూడటానికి సాధారణంగా అన్పించినా,మీ భాగస్వామితో మీ బంధాన్ని ఎంతో బలపరుస్తాయి.

మీరు కొత్తగా ప్రేమలో పడినా, లేక కొత్త పెళ్ళయినవారైతే, మేము చెప్పే ఈ నిజ జీవిత ఉదాహరణలు సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రతి జంట అర్థం చేసుకోగలిగే పరిస్థితులు ఇవిగో.

చాలా పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు…

చాలా పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు…

వాదన మధ్యలో, ఇద్దరూ ఒకేసారి మౌనంగా మారిపోయి, హఠాత్తుగా నవ్వటం మొదలుపెడతారు. ఆపకుండా నవ్వుతూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుపోతారు. ఎప్పుడైనా ఇలా అనుభవించారా? కొన్నిసార్లు ఎంతో పెద్ద గొడవలు కూడా నిమిషంలో ఇలా ఆగిపోతాయి!

కౌగిలింతల సమయంలో..

కౌగిలింతల సమయంలో..

అన్ని కౌగిళ్ళు ఒకటి కాదు. కొన్నిసార్లు ఈ భాగస్వామిని ఎలా కౌగిలించుకుంటారంటే అతను లేదా ఆమె శరీరంలోకి వెళ్ళిపోవాలన్నంత గట్టిగా! ఇద్దరూ హఠాత్తుగా రెండు అయస్కాంతాలు అతుక్కుపోయినట్లు అయిపోతారు. దాదాపు ప్రతి జంట ఇలాంటి భావాలను తమ బంధంలో ఒక్కసారైనా అనుభవించే ఉంటారు.

ముద్దు వర్సెస్ ఘాటైన ముద్దు

ముద్దు వర్సెస్ ఘాటైన ముద్దు

సాధారణ ముద్దు ఘాటైన ముద్దు కాదు. పెదవులు కలిసే ఘాటైన ముద్దు కొన్నిసార్లయితే ఇక అది ఆగదు అనేలాగా సాగుతూనే ఉంటుంది. కొంతమంది జంటలు గంటలు గంటలు అలానే ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు! కొన్ని ముద్దులు ఆగటానికి తిరస్కరిస్తాయి!

మీ గొంతు మారినప్పుడు…

మీ గొంతు మారినప్పుడు…

మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు, మీ భాగస్వామి సడెన్ గా ఫోన్ చేస్తారు. ఆమెతో మాట్లాడటం మొదలుపెడతారు కానీ టాపిక్స్ మారినప్పుడు మీ గొంతుకూడా తెలియకుండా మారటం మొదలవుతుంది! మీ గొంతులో మార్పు పసిగట్టి మీ భాగస్వామి కూడా గుసగుసల్లోకి మారతారు!

ఆమె గొంతు మారగానే మీలో లైంగికంగా కోరిక పెరిగి, మీ గుండెవేగం పెరుగుతుంది! హఠాత్తుగా మీ బాస్ చాలా చెడ్డ మూడ్ లో మీ వైపు వస్తున్నారని చూసి ఫోన్ పెట్టేసి సాధారణంగా మారిపోతారు! ఇలా ఎప్పుడన్నా జరిగిందా?

మీ దృష్టి మరలినప్పుడు…

మీ దృష్టి మరలినప్పుడు…

మీరేదో విషయంపై బాధపడుతున్నారు. ఇంటికి వెళ్ళగానే, మీ భార్యతో అది చర్చించటానికి ప్రయత్నిస్తారు. తనతో చెప్పటం మొదలుపెట్టగానే, ఆమె అందం చూసి మీ దృష్టి మరలిపోతుంది మరియు ఏం చెప్పాలో కూడా మర్చిపోతారు! ఇలా మీకు కూడా జరిగిందా?

ఆమెకి తలనొప్పిగా ఉన్నప్పుడు..

ఆమెకి తలనొప్పిగా ఉన్నప్పుడు..

మీ భార్య ఇంటికి తలనెప్పితో వస్తారు. మిమ్మల్ని తలపట్టమని అడుగుతారు. మీరు మెల్లిగా తలను మసాజ్ చేయటం మొదలుపెడతారు. కానీ మెల్లగా... మీ చేతులు ఆమె మెడ, అక్కడనుంచి మరింత కిందకి సాగుతూ పోతాయి!

ఆమె సీరియస్ గా ఒక చూపు చూస్తారు! మీరు వెంటనే ఒక అందమైన నవ్వు నవ్వేసి ఆర్గాజం కూడా తలనొప్పిని తగ్గిస్తుందని ఆమెని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు!

మీరు పొగిడినప్పుడు…

మీరు పొగిడినప్పుడు…

సాధారణంగా, మీరు చాలా విమర్శనాత్మకంగా ఉంటారు, కానీ మీ భార్యను ఏ కారణం లేకుండా పొగుడుతారు.మీకు తెలుసా మీకెందుకు పదే పదే పొగడాలని, ఆమె అందాన్ని కవితలతో వర్ణించాలని ఎందుకు అన్పిస్తుందో? ఎందుకంటే మీరు లైంగికంగా ఉత్తేజితమయ్యారని. ఆ ఆనందాన్నిచ్చే రసాయనాలు మీ తలలో విడుదలైనప్పుడు మీరు అనంతంగా పొగుడుతూనే పోతారు!

ఆమె మిమ్మల్ని తువ్వాలు అడిగినప్పుడు…

ఆమె మిమ్మల్ని తువ్వాలు అడిగినప్పుడు…

మీ భార్య స్నానానికి తువ్వాలు లేకుండా వెళ్తారు. స్నానం తర్వాత,బాత్ రూం తలుపు కొంచెం తీసి మిమ్మల్ని తువ్వాలు అడుగుతారు! మీరు అదో మంచి అవకాశంగా భావిస్తారు!

మీరు తువ్వాలు ఇచ్చేటపుడు మోసపూరితంగా మీరు తలుపును మరింత తీసి ఆమెను నగ్నంగా చూసేయటంతో,ఆమె హఠాత్తుగా తలుపు మూయటంతో మీ వేళ్ళు తలుపుసందులో చిక్కుకుపోతాయి! అయ్యో! మీకు ఇది ఎప్పుడన్నా జరిగిందా?

ఆమె ముభావంగా ఉన్నపుడు

ఆమె ముభావంగా ఉన్నపుడు

మీరు పనిలో ఉన్నప్పుడు, మీ భార్య ఫోన్ చేసి తన మనసు బాలేదని చెప్తారు. ఆమె మూడ్ మార్చతానికి ఆమెను ఒక డార్క్ చాక్లెట్ బార్ ను తింటూ మీ గురించి ఆలోచించమని చెప్తారు! ఆమె దానికి నవ్వుతున్నప్పుడు, మీ వాదనను సమర్థించుకోటానికి డార్క్ చాక్లెట్ తినటం వల్ల సంతోషాన్నిచ్చే రసాయనాలు మెదడులో విడుదలవుతాయని, దానివల్ల మీ మూడ్ వెంటనే మారిపోతుందని చెప్తారు.

మీరు పడుకున్నప్పుడు…

మీరు పడుకున్నప్పుడు…

మీరు నిద్రలో ఉన్నప్పుడు, మీరు సడెన్ గా ఉలిక్కిపడి లేచి ఎదురుగా మీ భాగస్వామి కన్నార్పకుండా మిమ్మల్నే చూస్తున్నారని గమనిస్తారు. మీకు అలా ఎప్పుడన్నా జరిగిందా? ఇలాంటి విషయాలు ప్రతి జంటకి జరుగుతుంటాయి. జంటలు తమ ప్రేమను, దగ్గరితనాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళటానికి అనుక్షణం ప్రయత్నిస్తే వైవాహిక జీవితం ఎంతో అందంగా మారిపోతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Things Couples Can Relate To

    Things Couples Can Relate To,If you have started a new relationship recently or if you have married recently, you will be able to relate to certain examples of real life romantic situa
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more