ఇద్ద‌రు అమ్మాయిల‌తో ఒకేసారి డేటింగ్ నా జీవితాన్ని ఎలా మార్చిందంటే....

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఉద్యోగరీత్యా నేను ఇటీవ‌లే వేరే సిటీకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాను. ఇక్క‌డ కొత్త స్నేహితుల‌ను చేసుకోవాల‌నుకున్నాను. నా స్నేహితులు ఎక్కువ‌గా నేను పుట్టిన ప్రాంతంలో వాళ్ల వాళ్ల బిజీ జీవితాల‌తో గ‌డుపుతున్నందుకు నాకు చాలా లోన్లీగా అనిపించేది. ఒక‌సారి బాగా బోర్‌గా అనిపించి డేటింగ్ యాప్ లో నా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వెత‌క‌డం ప్రారంభించాను.

అలా వాళ్ల‌ను క‌లిశాను

అలా వాళ్ల‌ను క‌లిశాను

కొన్ని రోజులు డేటింగ్ యాప్‌లో అలాగే గ‌డుపుతుండ‌గా ఇద్ద‌రు అమ్మాయిలు ప‌రిచ‌య‌మై మంచి స్నేహితుల‌య్యారు. వాళ్ల‌తో చాటింగ్ చాలా బాగా అనిపించేది. ఒక‌రితో నా ప్ర‌యాణ వివ‌రాలు, ఉద్యోగ విష‌యాలు, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతుండేవాడిని. మ‌రొక‌రితో సంగీతం, జంతువులు, సినిమాల‌పైన నాకున్న ప్యాష‌న్ చెప్పుకునేవాడిని. ఇద్ద‌రితోనూ సాన్నిహిత్యం బాగా అనిపించేది. వీరిలో ఎవ‌రిని ఎంచుకోవాలో అర్థ‌మయ్యేది కాదు. ఎవ‌రితో సంబంధాన్ని త‌దుప‌రి ద‌శ‌కు తీసుకెళ్లాలో పాలుపోలేదు. అప్పుడే అనిపించింది.. ఇద్ద‌రితో డేటింగ్ చేస్తే త‌ప్పేంటి అని! ఇద్ద‌రిని అర్థం చేసుకునేందుకు, నా సామ‌ర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇదే అవ‌కాశ‌మ‌నిపించింది.

మొద‌ట్లో అంతా థ్రిల్లింగ్‌..

మొద‌ట్లో అంతా థ్రిల్లింగ్‌..

మొద‌ట కొన్ని రోజులు చాలా ఫ‌న్‌తో నిండి ఉండేది. పొద్దునే వాళ్ల గుడ్ మార్నింగ్ మెసేజీలు, రాత్రి వాళ్ల గుడ్ నైట్ విషెస్ తో రోజులు గ‌డిచేవి. నేను వాళ్ల‌కు స్నేహితుడి కంటే ఎక్కువ క‌దా! అఫ్‌కోర్స్ ఇద్ద‌రికీ అనుకోండి.! కాస్త థ్రిల్లింగ్‌, ఎక్సైట్‌మెంట్‌గా అనిపించేది. రోజంతా వాళ్ల కాల్స్‌, మెసేజ్‌ల‌తో నా ఫోన్ మోగుతూనే ఉండేది. వాళ్లిద్ద‌రి సాన్నిహిత్యం పొందుతున్నందుకు ఒకింత గ‌ర్వంగా ఉండేది.

మూడువారాల‌కు మొహం మొత్తింది

మూడువారాల‌కు మొహం మొత్తింది

మూడు వారాల త‌ర్వాత ఇద్ద‌రితో డేటింగ్ చేయ‌డం వ‌ల్ల మొహం మొత్తింది. వాళ్ల‌తో ఎంజాయ్ సంగ‌తి అటుంచి అదో పనిలా అనిపించ‌సాగింది. మెల్లిమెల్లిగా నేను చేస్తున్న ప‌ని నాకే గిల్టీగా అనిపించేది. ఇద్ద‌రు అమ్మాయిల‌ను మోసం చేస్తున్నాన‌నే భావ‌న మొద‌లైంది. వాళ్ల స్థానంలో నేనుంటే ఎలా ఉండేద‌న్న ఆలోచ‌నే దిగులు క‌లిగించింది.

నేను సంతోషంగా ఉండ‌లేక‌పోయాను...

నేను సంతోషంగా ఉండ‌లేక‌పోయాను...

నెల త‌ర్వాత ఫ్ర‌స్ట్రేష‌న్‌గా అనిపించింది. ఇద్ద‌రితో డేటింగ్ అనే ఐడియా పిచ్చి ప‌నిగా అనిపించింది. ఇద్ద‌రిని సంతోష‌పెట్టే క్ర‌మంలో నేను సంతోషంగా ఉండ‌లేక‌పోయాను. ఒక‌రి నుంచి ఏమి కావాలో నాకు అస్స‌లు అర్థం అయ్యేది కాదు. స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

రాత్రుళ్లు నిద్ర ప‌ట్టేది కాదు..

రాత్రుళ్లు నిద్ర ప‌ట్టేది కాదు..

ఇద్ద‌రు అమ్మాయిల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నానే ఆలోచ‌న మ‌న‌శ్శాంతి లేకుండా చేసేది. రాత్రుళ్లు స‌రిగ్గా నిద్ర‌ప‌ట్టేది కాదు. ఇందులో వారి త‌ప్పేముంది? నాతో ఎవ‌రైనా ఇలాగే ఆడుకుంటే నా పరిస్థితి ఏమిటి? ఎలా మారిపోతున్నానో నన్ను నేను చూసుకుంటే జాలేస్తోంది. కొత్త న‌గ‌రంలో నా ఆనందం కోసం ఇద్ద‌రిని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాను.

క్ష‌మాప‌ణ స‌రిపోదు

క్ష‌మాప‌ణ స‌రిపోదు

నేను ఇదంతా కావాల‌ని చేయ‌లేదు. అయితే త‌ప్పుదోవ‌లో ప‌డి త‌ప్పుడు వాగ్దానాలైతే చేయ‌లేదు. నా ఫోన్ తీసుకొని పూర్తి వివ‌రాల‌తో మెసేజ్ రాశాను. నేను చేసిన త‌ప్పేమిటి, పరిస్థితులు ఎలాంటివి అన్నీ వివ‌రంగా టైప్ చేసి ఇద్ద‌రికీ పంపించేశాను. వాళ్ల కోపాన్ని , అస‌హ్యాన్ని త‌ట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. గ‌తంలోకి వెళ్లి మార్చే అవ‌కాశం ఉంటే ఎంత క‌ష్ట‌మైనా చేసేందుకు నేను సిద్ధం. జీవితంలో సంఘ‌ట‌న‌ల‌ను మార్చ‌లేం క‌దా! ఇదో గుణ‌పాఠంలా మిగిలిపోతుందేమో!

English summary

I was dating two girls at the same time but realised it was the biggest mistake of my life

I was dating two girls at the same time but realised it was the biggest mistake of my life