For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Same Age Cousins: మీ కజిన్ కూడా మీ వయస్సే అయితే ఎన్ని లాభాలో తెలుసా?

బంధువుల్లోనే మీ వయస్సు వారైనా కజిన్స్ మీకు స్నేహితులుగా ఉంటే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ కజినే మీకు మిత్రుడు/మిత్రురాలు అయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

|

Same Age Cousins: మనిషి సామాజిక జీవి. అతనికి తోడు కావాలి. కుటుంబమే కాకుండా బయట వ్యక్తుల పరిచయం, సాంగత్యం కావాల్సిందే. స్నేహితులు, పరిచయస్తులు ఇలా పేరు ఏదైనా మనిషికి సమాజంతో సంబంధాలు కావాలి. కుటుంబంతో పంచుకోలేని చాలా విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. కుటుంబసభ్యులతో చేయలేని వాటిని మిత్రులతో కలిసి చేస్తాం. మిత్రుత్వం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇవే కాకుండా బంధువుల్లోనే మీ వయస్సు వారైనా కజిన్స్ మీకు స్నేహితులుగా ఉంటే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ కజినే మీకు మిత్రుడు/మిత్రురాలు అయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

స్నేహం ఎప్పటికీ చెదిరిపోదు

స్నేహం ఎప్పటికీ చెదిరిపోదు

కుటుంబంలో ఒకే వయస్సులో ఉన్న బంధువులను పొందడం మన చేతుల్లో లేదు. అది దేవుని ఆశీర్వాదం అనే చెప్పాలి. మీరు ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి, చిన్నప్పటి నుండి బంధం ఉంటుంది. స్నేహం పరంగా మీ మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. మీ స్నేహం మరింత గాఢంగా మారుతుంది. కుటుంబానికి చెందిన కొన్ని విషయాలు బయటి ఫ్రెండ్ తో షేర్ చేసుకోలేం. కానీ కజిన్స్ లో మంచి ఫ్రెండ్ ఉంటే అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. కుటుంబ రహస్యాలను కూడా వారితో పంచుకోవచ్చు.

ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తే సందడి మామూలుగా ఉండదు

ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తే సందడి మామూలుగా ఉండదు

కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లడం చాలా మందికి బోర్ గానే ఉంటుంది. కుటుంబంలో మనకంటే పెద్ద వారు లేదంటే చిన్నవాళ్లు ఉంటారు. వాళ్లు తెగ విసిగిస్తారని అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది యువత కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు అంతగా ఇష్టం చూపరు.

అలా కాకుండా మీ కజిన్ కూడా మీ కుటుంబంతో విహారయాత్రకు వస్తే భలే మజాగా ఉంటుంది. ఇలాంటి పర్యటనల వల్ల మీ మధ్య బంధం మరింతగా బలోపేతం అవుతుంది. ట్రిప్ అంతా కలిసే ఉంటారు. కలిసే తింటారు. కలిసే కొత్త ప్రదేశాలను చూస్తారు.

కలిసి కాలక్షేపం చేయొచ్చు

కలిసి కాలక్షేపం చేయొచ్చు

బయటి స్నేహితులను పంపేందుకు అమ్మ అయినా, నాన్న అయినా పంపడానికి అంతగా ఇష్టపడరు. అదే బంధువుల్లోనే స్నేహితులు ఉంటే తల్లిదండ్రులు కూడా పంపడానికి సంకోచించరు. సేమ్ ఏజ్ ఉన్న కజిన్స్ తో ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులు ఏమీ అనరు. రెస్టారెంట్లకు, మాల్స్ కు, విహారయాత్రలకు వెళ్లవచ్చు.

కష్టనష్టాలు పంచుకోవచ్చు

కష్టనష్టాలు పంచుకోవచ్చు

మీ కజిన్స్ లో మీకు స్నేహితులు ఉంటే వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. కుటుంబానికి సంబంధించిన అంశాల నుండి వ్యక్తిగత విషయాలను కూడా వారితో చర్చించవచ్చు. బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఏదైనా కజిన్స్ తో పంచుకోవచ్చు.

ముఖ్యమైన కార్యక్రమాల్లో

ముఖ్యమైన కార్యక్రమాల్లో

మీ బర్త్ డే పార్టీ, స్కూల్ ప్రోగ్రామ్స్ లేదా ఫేర్ వెల్ పార్టీలో మీ ప్రదర్శన ఏదైనా మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించడానికి మరియు ప్రశంసించడానికి మీ కజిన్ సిద్ధంగా ఉంటారు. మీరు విజయం సాధిస్తే.. మీకన్నా వారే ఎక్కువ సంబరాలు జరుపుకుంటారు. మీ భవిష్యత్ ప్రణాళికలను కూడా షేర్ చేసుకుంటారు. అందుకే ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు.

ఆలోచనలను పంచుకుంటారు

ఆలోచనలను పంచుకుంటారు

ఏదైనా తప్పు జరిగినప్పుడు.. మిమ్మల్ని నిందించకుండా మీకు దాని గురించి తెలియజేసే తొలి వ్యక్తి మీ కజిన్. ఇది మాత్రమే కాదు.. మీ వేళ్లు సహజంగా వారి నెంబర్ కే ఫోన్ చేస్తాయి. మీరు పార్టీకి ఏ డ్రస్ వేసుకోవాలనే గందరగోళంలో ఉంటే.. అప్పుడు కూడా వారే ఉత్తమమైన సలహాలు ఇస్తారు.అంతేకాదు మీరు ఒకరికొకరు మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.

English summary

Benefits of having same age group cousins in Telugu

read on to know Benefits of having same age group cousins in Telugu
Story first published:Wednesday, November 30, 2022, 17:00 [IST]
Desktop Bottom Promotion