For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీ కుటుంబంతో కలిసి చేసే కొన్ని కార్యకలాపాలు

By Super
|

2015, ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అలా మీరు లేకపోతే, ఈ 67 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీరు మీ కుటుంబంతో చేయవలసిన కొన్ని మంచి, ఆనందకరమైన కార్యకలాపాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ ప్రత్యేకమైన రోజును గొప్పగా జరుపుకోవడం చాలా అవసరం, అందుకని మూడు రంగుల బట్టలు వేసుకుని, రోజంతా సరదాగా గడపండి. స్వాతంత్ర్య దినోత్సవం భారతీయులకు ఒక ప్రత్యేకమైన పండుగ రోజు ఎందుకంటే ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధులు వారి జీవితాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. అందువల్ల, మనం ఆ రోజును ఎంతో గౌరవంతో, గర్వంతో మనస్పూర్తిగా జరుపుకోవడం అవసరం.

స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఏమి చేయాలో మీకు తెలియకపోతే, మీకు, మీ పిల్లలకు ఇక్కడ 10 రకాల కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. మీకోసం తయారు చేసిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ కార్యకలాపాల పట్ల కొద్దిగా దృష్టి పెట్టండి. ఈ పండుగను జరుపుకోవడానికి మీరు ఇంతకుముందే ప్రణాళిక వేసుకున్నట్లైతే, వీటిని తెలుసుకొని కొన్నిటిని మీ కార్యకలాపాల జాబితాలో చేర్చుకోండి.

స్వాతంత్ర్య దినోత్సవం రోజు, గతంలో యుద్ధంలో పోరాడిన భారతీయుల కోసం గౌరవ వందనం చేయడం భారతీయులకు అలవాటు. ఒకవేళ మీరు, మీ కుటుంబ సభ్యులు నగరం మొత్తం చుట్టిరావాలి అనుకుంటే, మీరు ప్రభుత్వ భవనాలు, కార్లు, చివరికి నివాస భవనాల వద్ద మూడు రంగుల జండాను గమనించండి.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు, మనం కుటుంబ సభ్యులతో గడుపుదాం. ఇక్కడ పిల్లలకు, కుటుంబ సభ్యులకు కొన్ని స్వాతంత్ర్య దినోత్సవ కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి.

చేతితో తయారుచేసిన వస్తువులు

చేతితో తయారుచేసిన వస్తువులు

రంగులను, స్కెచ్ లను ఏ పిల్లవాడైనా ఇష్టపడకుండా ఉంటాడ? ఒక తెల్లను చార్ట్ బోర్డ్ కొని మన భారతీయ జాతీయ పతాకాన్ని తయారు చేయడంలో పిల్లలకు సహాయం చేయండి. మీకు కుంకుమ పువ్వు ఆరంజ్, తెలుపు, నీలం, ఆకుపచ్చ నాలుగు రంగులు మాత్రమే అవసరం. మీరు కూడా ఈ అద్భుతమైన రోజు పిల్లలతో సమయం గడపడానికి పిల్లలకు కార్యాచరణ ప్రణాళిక చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది.

టీవీ చూడటం

టీవీ చూడటం

స్వాతంత్ర్య దినోత్సవం రోజు టెలివిజన్ లో వచ్చే సినిమాలను పిల్లలకు చూపిస్తూ మీరు పిల్లలతో సమయాన్ని గడపడం కూడా మరో మంచి స్వాతంత్ర్య దినోత్సవ కర్యకలాపమే. మీరు మీ కుటుంబ బంధాన్ని పాప్కార్న్ నములుతూ పూర్తి చేయవచ్చు.

కవాతును కూడా చూడండి

కవాతును కూడా చూడండి

మన స్వాతంత్ర్య సమరయోధుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి, మీరు, మీ పిల్లలు కవాతును చూడడానికి ఉదయానే నిద్ర లేవండి. దీనివల్ల స్వాతంత్ర్యం కోసం సమరయోధులు ఎంత కష్టపడ్డారు అనే విషయం మన పిల్లలకు తెలుస్తుంది. దీనివల్ల మీకు మీ పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.

ప్రత్యేకమైన వంటలను వండండి

ప్రత్యేకమైన వంటలను వండండి

ఈ స్వంత్ర దినోత్సవం రోజు, కుటుంబ అనుబంధాలను పెంచుకోవడానికి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం అనేది మంచి మార్గాలలో ఒకటి. భర్తలు వంటింట్లో మీ చేయి పెట్టడానికి ప్రయత్నించి, ఒక ప్రత్యెక స్వాతంత్ర్య దినోత్సవ భోజనం తయారుచేయడంలో మీ భార్యకు సహకరించండి. మీరు జాతీయ జండా ఉండే ఒక కేక్ ను కూడా తయారుచేయడానికి ప్రయత్నించండి.

దేశభక్తితో కూడిన ప్రదేశాలను సందర్శించండి

దేశభక్తితో కూడిన ప్రదేశాలను సందర్శించండి

గౌరవ భారతీయ సమరయోధుల గౌరవార్ధం, మీ కుటుంబాన్ని బైటికి తీసుకెళ్ళి నగరంలో ఉన్న అన్ని మ్యూజియంలను సందర్శించండి. మనకు స్వాతంత్ర్యం రావడానికి మన దేశం ఎంత పోరాడిందో అన్న విషయం తెలుసుకోవడానికి ఈ సందర్సన సహాయపడుతుంది.

దేశభక్తి గీతాలు ప్లే చేయండి

దేశభక్తి గీతాలు ప్లే చేయండి

మీరు సంగీత ప్రియులైతే, ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి వాద్యాన్ని అందించండి. దేశభక్తి గీతాలు ప్లే చేసి, మీ కుటుంబ సభ్యులతో కలిసి పాడండి. మన స్వాతంత్ర్యం గురించి బోధించే DVD లు కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు.

మూడు రంగులతో గదులను అలంకరించడం

మూడు రంగులతో గదులను అలంకరించడం

మీ కుటుంబంతో అనుబంధాన్ని బట్టి, మన జాతీయ జండా తో మీ ఇంటిని అలంకరించండి. మూడు-రంగులు మీ ఇంటి అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. మీరు మీ పిల్లలు తయారుచేసిన చార్ట్ లను గోడల మీద, తలుపుల మీద తగిలించండి.

మెరుపులు

మెరుపులు

స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీరు మీ కుటుంబంతో, స్నేహితులతో మందులు కాల్చి పండుగ జరుపుకుంటారు. మీ కుటుంబంతో, సన్నిహితులతో ఒక చోట చేరి, మీ టెర్రేస్ మీద జండా ఎగురవేస్తారు. జాతీయ గీతం పాడి, మందులు కాలుస్తారు.

పోటీలు

పోటీలు

మీరు కుటుంబంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహించండి. అలాంటి ఒక స్వాతంత్ర్య దినోత్సవం రోజు వస్త్రధారణ పోటీలు నిర్వహించండి. మీకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధులలా వస్త్రాలంకరణ చేసుకోవడం, ‘గెస్సింగ్ గేమ్' ఆడుకోవడం లేదా ‘ఉత్తమ వస్త్రాలంకరణ స్వాతంత్ర్య సమరయోధుడు' కోసం పోటీలు నిర్వహించడం వంటివి.

కుటుంబంతో విహారయాత్ర

కుటుంబంతో విహారయాత్ర

కుటుంబంతో కలిసి వేడుక జరుపుకోవడానికి ఏదైనా ఇతర సందర్భం అవసరమా? ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు, మీరు మీ కుటుంబంతో కలిసి ఒక మంచి ఫాం లేదా రిసార్ట్ కి వెళ్లి గడపండి.

English summary

Activities For The Family This Independence Day

How many of you are looking at a quite Independence Day this August 15, 2013? If you are not, then here are some of the best and fun activities you can do with your family this 67th Independence Day.
Story first published: Friday, August 14, 2015, 17:53 [IST]
Desktop Bottom Promotion