For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: ఇలాంటి మగవాళ్లకు దూరంగా ఉండటం మంచిది..!!

మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ రకరకాల వ్యక్తిత్వాలు కలిగినవాళ్లు ఉంటారు. ఇప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగిన మగవాళ్ల గురించి, ఎలాంటి మనస్తత్వం కలిగిన మగవాళ్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందో తెలుసుకుందాం.

By Swathi
|

మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ రకరకాల వ్యక్తిత్వాలు కలిగినవాళ్లు ఉంటారు. ఇప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగిన మగవాళ్ల గురించి, ఎలాంటి మనస్తత్వం కలిగిన మగవాళ్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందో తెలుసుకుందాం. కొంతమంది చాలా విషపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి వాళ్లు.. తమతో కలిసి ఉండే వాళ్ల జీవితాన్ని నరకంగా మారుస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

7 Types Of Toxic Men To Avoid

కొన్ని సంబంధాలు సంతోషాన్ని, ప్రశాంతతను జీవితాంతం అందిస్తాయి. కొన్ని సంబంధాలు విషపూరితమైన వ్యక్తుల వల్ల మీ పాజిటివ్ ఎనర్జీ మొత్తం కోల్పోయి.. ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతారు.

అందుకే జీవితాంతం గడిపే వ్యక్తిని చాలా కేర్ ఫుల్ గా ఎంచుకోవాలి. ఏమాత్రం ఆ వ్యక్తి మనస్తత్వం కాస్త విభిన్నంగా ఉన్నా.. మీ జీవితంలో సంతోషం కోల్పోతారు. కాబట్టి.. 7 రకాల మగవాళ్లకు దూరంగా ఉండాలి. మరి వాళ్లెలాంటి వాళ్లో తెలుసుకుందామా

ప్రతి ఒక్కరినీ అసహ్యించుకునే వ్యక్తి

ప్రతి ఒక్కరినీ అసహ్యించుకునే వ్యక్తి

కొంతమంది అబ్బాయిలు ప్రతి ఒక్కరినీ అసహ్యించుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంపై పూర్తీగా వ్యతిరేక భావన ఉంటుంది. అలాంటి మగవాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ పాజిటివ్ గా ఫీలవనియ్యరు. కాబట్టి అలాంటి పార్ట్ నర్ కి దూరంగా ఉండటమే మంచిది.

ప్రతీది అప్పుచేసే వ్యక్తి

ప్రతీది అప్పుచేసే వ్యక్తి

కొంతమంది అబ్బాయిలు ఎలాంటి సందేహం లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటీ ఇతరులతో తీసుకుంటారు. దాన్ని మళ్లీ తిరిగి ఇవ్వాలని కనీస బాధ్యతను కూడా ఫీలవరు. అలాంటి అబ్బాయిలతో జీవితం పంచుకోవడం కష్టం. కాబట్టి దూరంగా ఉండండి.

తప్పులు చూపించే వ్యక్తి

తప్పులు చూపించే వ్యక్తి

కొంతమంది అబ్బాయిలు తాము చేసే తప్పులు కాకుండా.. మీరు చేసే ప్రతి తప్పుని గుర్తిస్తారు. ప్రతిసారి మీ అహాన్ని చాలెంజ్ చేసినట్టు ఉంటుంది. మీరు ప్రతిరోజూ అన్నీ తప్పులే చేస్తారని అరుస్తుంటారు. అలాంటి వ్యక్తిలో ఓర్పు ఉండటం కష్టం. కాబట్టి.. అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండాలి.

మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించే వాళ్లు

మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించే వాళ్లు

ఉపాయంగా ఆలోచించడం, మార్చాలని ప్రయత్నించడం వంటి లక్షణాలు కలిగిన అబ్బాయిలతో స్నేహానికి, బంధానికి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్లతో జీవితం పంచుకోవడం చాలా కష్టం.

మీ వెనక మాట్లాడేవాళ్లు

మీ వెనక మాట్లాడేవాళ్లు

మీతో నవ్వుతూ మాట్లాడుతారు. కానీ.. మీరు లేనప్పుడు మీ గురించి నెగటివ్ గా మాట్లాడే తత్వం చాలా మంది అబ్బాయిలకు ఉంటుంద.ి అలాంటి అబ్బాయిలు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

మిమ్మల్ని మాట్లాడనివ్వని వ్యక్తి

మిమ్మల్ని మాట్లాడనివ్వని వ్యక్తి

కొంతమంది అబ్బాయిలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ.. మీరు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లు రిలేషన్ లో ఫెయిల్ అవుతారు. అలాంటి వాళ్లు ఎప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు.

పోల్చేవాళ్లు

పోల్చేవాళ్లు

మీతో తమ మాజీ ప్రేమికురాలి గురించి మాట్లాడటం , వాళ్లతో మిమ్మల్ని పోల్చే వ్యక్తులకు జీవితంలో దూరంగా ఉండటమే మంచిది. దీనివల్ల మీ మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు.

English summary

7 Types Of Toxic Men To Avoid

7 Types Of Toxic Men To Avoid. Some people have more of toxic vibes in them and such people may make life hell when you start living with them. Here are 7 toxic men that you must avoid!
Story first published: Thursday, December 1, 2016, 16:15 [IST]
Desktop Bottom Promotion