For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీకి ఎందుకంత ప్రాముఖ్యత ?

By Swathi
|

ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఫ్యామిలీ జీవితంలో అనేక విషయాలు నేర్పిస్తుంది. సమాజం గురించి మాట్లాడాలంటే.. ముందుగా ఫ్యామిలీ గురించి చర్చించాలి. తెలుసుకోవాలి. పుట్టినప్పటి నుంచి రకరకాల సంబంధాలు కలిగి ఉండే ఫ్యామిలీలో పెరుగుతారు.

అలాంటప్పుడు ఫ్యామిలీ ప్రాధాన్యత గురించి చర్చించడం పెద్ద కష్టమేమీ కాదు. మనుషులు, ఫ్యామిలీకి ఉన్న బలమైన ప్రేమ కారణంగా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనదిగా మారింది. సైకాలజిస్ట్ లు, ఫిలాసఫర్ల ప్రకారం ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనదని వివరిస్తున్నారు. ఫ్యామిలీ కారణంగా జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాగే సంబంధాలకు ఎలాంటి డ్యామేజ్ తీసుకురావు.

మగవాళ్లకు

మగవాళ్లకు

చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ఫ్యామిలీ వల్ల మగవాళ్లు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఫ్యామిలీ లేకుండా వాళ్లు.. సరైన అలవాట్లు అలవరచుకోలేరు.

లైఫ్ జర్నీ

లైఫ్ జర్నీ

ప్రతి ఒక్కరి జీవితం ఫ్యామిలీతో మొదలవుతుంది. తల్లిదండ్రుల ప్రేమ పొందుతారు. స్వార్థంలేని ప్రేమ పొందగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.

నేర్చుకోవడానికి, పెరగడానికి

నేర్చుకోవడానికి, పెరగడానికి

పుట్టిన తర్వాత ఏ విషయాన్నైనా నేర్చుకోవడం చాలా అవసరం. కుటుంబం ద్వారా ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాలను నేర్చుకుంటారు. కుటుంబం ద్వారా బాధ్యతను తెలుసుకోగలుగుతారు.

బాధలు, సంతోషాలు పంచుకోవడానికి

బాధలు, సంతోషాలు పంచుకోవడానికి

ఫ్యామిలీలో ఒకరికి ఒకరు కలిసి మెలసి ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ సంతోషాలను, బాధలను పంచుకుంటారు. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ముఖ్యమైనది. ఇలా బాధలు, సంతోషాలు పంచుకోవడం వల్ల బాధ్యత తెలుసుకుంటారు. ఇది ఫ్యామిలీతో మొదలై.. బయటకు స్ప్రెడ్ అవుతుంది.

ఇద్దరి మధ్య ప్రేమ

ఇద్దరి మధ్య ప్రేమ

మనుషులు కుల, మతాలతో సంబంధం లేకుండా.. అందరూ కలిసి మెలసి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమ, అర్థం చేసుకునే తత్వం, గౌరవం, వంటి రకరకాల గుణాలను ప్రోత్సహిస్తాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా అవసరం.

సమస్యలు

సమస్యలు

లైఫ్ అంటే.. అంత సులభమైనది కాదు. ఎప్పుడూ సంతోషాలతో నిండి ఉండదు. సమస్యలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య అయినా.. తేలికగా పరిష్కరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనది.

ప్రశాంతత

ప్రశాంతత

ఒకరి నొకరు ప్రశంసించుకోవడం వల్ల ఫ్యామిలీ ద్వారా ప్రశాంతత పొందుతారు. సక్సెస్ అయినప్పుడు తమకు ఇష్టమైనవాళ్ల ద్వారా ప్రశంసలు పొందడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు జీవితం చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది.

English summary

Importance Of Family In One's Life

Importance Of Family In One's Life. Man, by nature, is a social animal, and he develops well only when he stays with the society.
Story first published:Monday, May 16, 2016, 16:55 [IST]
Desktop Bottom Promotion